భీమరాజును కాల్చిందెవరు?

7 Dec, 2014 00:44 IST|Sakshi

మృతదేహం పోస్టుమార్టంకు తరలింపు
తూర్పుగోదావరి పోలీసులు కేసు నమోదు
గాయపడిన వారికి చికిత్స

 
నాతవరం: నాతవరం మండలం సరుగుడు శివారు తొరడ గ్రామానికి చెందిన మాదాల భీమరాజు మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి అటవీప్రాంతంలో అసనగిరి సమీపంలో శుక్రవారం భీమరాజు మృతిచెందడం తెలిసిందే. నాతవరం ఎస్‌ఐ రమేష్, తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి ఎస్‌ఐ గోపాలకృష్ణ శనివారం సంఘటన స్థలానికి వెళ్లారు. భీమరాజుతోపాటు టేకుతోటలోకి వెళ్లి నూకరాజు, చిన్నబ్బాయి, ఎర్రయ్యలనుంచి వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శనివారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా నాతవరం ఎస్‌ఐ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ  భీమరాజు, మాదాల యర్రయ్య, మాదాల చిన్నబ్బాయి, ఉల్లి  చిన్నబ్బాయి. తూర్పుగోదావరి జిల్లా కెమ్మిలి గెడ్డ ప్రాంతంలోని టేకు ప్లాంటేషన్‌లో కలపకోసం వెళ్లారన్నారు.

టేకు నరుకుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తలు కాల్పులు జరిపారని తెలిపారన్నారు. చీకటి కావడంతో ఎవరు కాల్చారో తెలియడం లేదని ప్రత్యేక సాక్షులు చెబుతున్నారన్నారు. చిన్నబ్బాయి, యర్రయ్య, నూకరాజు, ఉల్లి  చిన్నబ్బాయిలకు స్వల్ప గాయాలయ్యాయన్నారు.  తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేస్తారన్నారు. వారులోతుగా దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌ఐ వివరించారు.  క్షతగాత్రులకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో స్వల్ప చికిత్స చేసి పంపించేశారు. మృతుని భార్య లక్ష్మి వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇద్దరు పిల్లలున్నారు.
 
 

మరిన్ని వార్తలు