రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం

29 Dec, 2014 08:13 IST|Sakshi
రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం

గుంటూరు : గుంటూరు జిల్లాలో ప్రైవేట్ మాఫియా రెచ్చిపోయింది.  రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించారు.  వరిగడ్డి వాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో పాటు మూడు గ్రామాల్లో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.


సుమారు 20 నుంచి 30మంది ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోనే కాకుండా, లోపల ఉన్న పొలాలకు కూడా దుండగులు నిప్పు పెట్టారు.  ఈ సంఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎదుర్కోలేకే... ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కూడా తాము రాజధానికి భూములు ఇచ్చేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు