ఇంకా తీరని ‘చింత’

18 Aug, 2014 00:21 IST|Sakshi
ఇంకా తీరని ‘చింత’

‘మాది రైతు ప్రభుత్వం.. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి ఆగస్టు 15 కల్లా 11 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం.. ఆయకట్టుకు నీరందిస్తాం.. పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థారుు సౌకర్యాలు కల్పిస్తాం.. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తాం..’

- ఇవీ సీఎం చంద్రబాబు, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు.
 
... కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రాజెక్టు క్రస్టుగేట్ల ఏర్పాటు పూర్తికాకపోవటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు అరకొరగా ఉండటంతో ముంపు గ్రామాలను నిర్వాసితులు వదిలి వెళ్లటం లేదు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
 
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి సాగు నీరు వచ్చేస్తుంది.. ఏటా రెండు పంటలు పండించుకోవచ్చన్న డైల్టా రైతుల ఆశలు ఈ యేడాది కూడా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. రైతు సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఆగస్టు 15 కల్లా 11 టీఎంసీల నీరు నిల్వ చేయూల్సి ఉండగా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే క్రష్ట్ గేట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలి. కానీ బిగించిన 24 క్రస్ట్‌గేట్లు సరిగా పని చేయడం లేదు. వీటికి అమర్చిన ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్, రబ్బర్ సీల్స్ సక్రమంగా పనిచేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది.
 
* ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే ముందుగా ముంపు గ్రామాలను ఖాళీ చేయించి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు పంపాలి. అలా పంపాలంటే పునరావాస కేంద్రాల ఏర్పాటు పూర్తి కావాలి. కానీ అది జరగలేదు.
* ఇటీవల ప్రాజెక్టులో కొద్దిపాటి నీరు చేరితేనే కోళ్లూరు, పులిచింతల గ్రామాలను వర ద నీరు తాకింది. 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే బెల్లంకొండ మండలంలోని కోళ్లూరు, పులిచింతల, గొల్లపేట, కేతవరం గ్రామాలు పూర్తిగా మునిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*  పులిచింతల, కోళ్లూరు గ్రామస్తుల కోసం అచ్చంపేట మండలం చిగురుపాడు పంచాయతీ పరిధిలో పునరావాసకేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 208 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా 126 కుటుంబాలే ఇళ్లు నిర్మించుకుంటున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోవడంతో చాలా ఇళ్లు వివిధ స్థారుుల్లో ఆగిపోయూయి.
* విద్యుత్, తాగునీరు వంటి కనీస వసతులు లేక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొల్లపేట గ్రామస్తులకు చౌటపాపాయపాలెం, రాజుపాలెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను కేటాయించారు. కేతవరం గ్రామస్తులకు అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం పంచాయతీ పరిధిలోని 28 ఎకరాల విస్తీర్ణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
* ఇక్కడ 320 కుటుంబాలకు 5 సెంట్లు చొప్పున కేటాయించి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గ్రంథాలయం, పశువైద్యశాల, ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాలు, అంగన్‌వాడి కేంద్రాలను నిర్మించారు. అరుునా నిర్వాసితులు గ్రామం వదిలి రాలేదు. దీంతో ప్రభుత్వ భవనాల్లోని సామగ్రి పోతోంది.

>
మరిన్ని వార్తలు