‘సిద్ధార్థ’కు వెయ్యి కోట్ల సంతర్పణ

16 Nov, 2016 01:55 IST|Sakshi
‘సిద్ధార్థ’కు వెయ్యి కోట్ల సంతర్పణ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
 
 సాక్షి, అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి కారుచౌకగా కట్టబెట్టింది. గజం రూ.లక్షన్నర దాకా పలికే అత్యంత విలువైన భూమిని ఎకరా రూ.లక్షన్నర చొప్పున 33 ఏళ్లపాటు లీజుకివ్వాలని రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణరుుంచింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లలో సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. దుర్గ గుడి భూముల లీజు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారుు.

 గుట్టుచప్పుడు కాకుండా అప్పగింత
 శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి భూములను ప్రైవేట్ విద్యా సంస్థకు అప్పగించేందుకు లోపారుుకారీగా జరుగుతున్న ప్రయత్నాలను 15 రోజుల క్రితం ‘సాక్షి’ సవివరంగా ప్రజల ముందుంచింది. ఆలయం భూములను తమకు శాశ్వతంగా అప్పగిస్తే అందుకు బదులుగా నగరం వెలుపల అంతే విస్తీర్ణంలో భూములను ప్రభుత్వానికి ఇస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసుకున్న దరఖాస్తు శరవేగంగా కదిలింది. ఈ భూముల అప్పగింత వ్యవహారంపై అక్టోబరు 31న మంత్రివర్గ సమావేశంలోనే చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విషయాన్ని అదే నెల 30వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వారుుదా వేసింది. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. రూ.వెరుు్య కోట్ల విలువైన దుర్గ గుడి భూములను ప్రైవేట్ విద్యాసంస్థకు కారుచౌకగా కట్టబెడుతూ గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.   

 ఈవో నివేదిక బుట్టదాఖలు
 సిద్ధార్థ అకాడమీకి ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి(ఈవో), ఐఏఎస్ అధికారి సూర్యకుమారి అందజేసిన నివేదికను కూడా పక్కనపెట్టేశారు. గతంలో దేవాదాయ భూములను విద్యా సంస్థలకు 50 ఏళ్ల పాటు లీజుకివ్వడాన్ని విజిలెన్‌‌స శాఖ తప్పుపట్టింది. దీంతో 2006లో అప్పటి ప్రభుత్వం దుర్గ గుడి భూముల లీజులను రద్దు చేసింది. అ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. సిద్దార్థ అకాడమీ పదేళ్లగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. ఆ భూములకు బదులుగా నగరం వెలుపల అంతే భూమిని  గుడి పేరిట రాసిస్తామని, లేదంటే ఎకరాకు ఏడాదికి రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

ఈ రెండు ప్రతిపాదలను తోసిపుచ్చుతూ ఆలయ ఈవో సూర్యకుమారి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. నగరం నడిబొడ్డున బెంజిసర్కిల్‌కు దగ్గరగా వాణిజ్య సముదాయాలు, ఇళ్ల మధ్య ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణరుుంచిన ధరల ప్రకారం రూ.716 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దేవాదాయ భూముల లీజు వ్యవహారంపై ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 571 ప్రకారం... ఈ భూములను వ్యవసాయేతర అవసరాలకు లీజుకిచ్చేటప్పుడు భూమి మార్కెట్ ధరలో పది శాతాన్ని లీజు మొత్తంగా నిర్ణరుుంచాలన్న నిబంధనను ఈవో తన నివేదికలో ప్రస్తావించారు.  
 
 అక్కడ ఎకరం విలువ రూ.70 కోట్లు
 దుర్గ గుడికి చెందిన 14.20 ఎకరాలకు ని బంధనల ప్రకారం రూ.71.66 కోట్లు లీజు మొత్తంగా నిర్ణరుుంచాల్సి ఉంటుందని, 2010లో రూ.కోటి లీజును డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన ట్లు ఈవో ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. సిద్దార్ధ అకాడమీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంటేనే తిరిగి ఆ సంస్థతో చర్చలకు జరపడానికి ఈవో సుముఖత తెలిపారు. ఈ నివేదికలో ఈవో పేర్కొన్న అన్ని అంశాలను ప్రభు త్వం లెక్కచేయలేదు. సిద్ధార్థ అకాడమీ యజమాన్యం కోరినట్లే  నామ మాత్రపు లీజుకు ఆ భూములను కట్టబెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లిస్తామని సిద్ధార్థ అకాడమీ ప్రతిపాదించగా... ఎకరానికి రూ.1.50 లక్షల చొప్పున లీజు ధర నిర్ణరుు స్తూ 33 ఏళ్ల పాటు ఆ భూములను అప్ప గించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూములకు మార్కెట్‌లో ఎకరా రూ.70 కోట్లు ధర పలుకుతోంది.

మరిన్ని వార్తలు