నాలుగు చోట్ల కుంగిన భూమి

29 Nov, 2015 15:27 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. మొన్నటి దాకా.. భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేయగా.. తాజాగా.. భూమి అకస్మాత్తుగా కుంగుతుండటం.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండలం లోని బుగ్గలేటిపల్లి, బుగ్గలపల్లి గ్రామాల్లో ఆదివారం నాలుగు చోట్ల భూమి కుంగింది. 15 అడుగుల వెడల్పు, 7 అడుగుల లోతుతో భూమి లోపలికి వెళ్లి పోయింది. దీంతో జనం భయంతో పరుగు తీశారు.

పొరుగు గ్రామాల ప్రజలు సైతం ఎక్కడ తమ ఇళ్లు కూలిపోతాయో అని భయపడుతున్నారు. కాగా.. భారీ వర్షాల కారణంగా భూగర్భంలో నీటి ప్రవాహ ఉదృతి కారణంగానే భూమి కుంగి పోతోందని భూగర్భ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. చింత కొమ్మ దిన్నె మండలంలోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. శాస్త్ర వేత్తలు సూచించారు.

మరిన్ని వార్తలు