అధికారపార్టీ నేతలకే ఉపాధి!

28 Jun, 2016 08:27 IST|Sakshi
అధికారపార్టీ నేతలకే ఉపాధి!

ఇప్పటికే రూ.18 లక్షలు స్వాహా
మరో రూ.15 లక్షలకు ఎసరు
చిన్నాగంపల్లిలో ఉపాధి పనుల్లో భారీ అవినీతి

 
నెల్లూరు: చిన్నాగంపల్లిలో ఉపాధి పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. 6 కుంట పనుల్లో కొందరు అధికార పార్టీ నాయకులు రూ.18 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. యంత్రాలతో నిర్వహించి నగదును అధికార పార్టీకి చెందిన సర్పంచ్ మాలకొండయ్య, కొందరు టీడీపీ నాయకులు పంపకాలు చేసుకున్నట్లు సమాచారం.

నాలుగు నెలల్లోనే అవినీతి తంతు:
కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఈ నగదు మొత్తం స్వాహా జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపాధిలో అవినీతిని అడ్డుకోవాలని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నెల క్రితం గ్రామస్తులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినా ఈ కుంట పనులకు అధికారులు బిల్లులు చెల్లిస్తూ వుండడం విశేషం. ఇప్పటి వరకు రూ.18 లక్షలు స్వాహా జరగ్గా మిగిలిన నగదు మెటీరియల్ నగదుగా ఉంది. ఈ పనుల్లో మెటీరియల్ నగదు కింద మరో రూ.15 లక్షల వరకు స్వాహా చేసేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

కూలీల అకౌంట్ల నుంచీ స్వాహా:
కూలీల అకౌంట్లల్లో  ఉపాధి నగదు జమా చేసినా అందులో 70 శాతం తనకివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో చేసిన కుంటలకు మళ్ళీ వర్క్ ఐడీ నంబర్లు మార్చి యంత్రాలతో పనులు నిర్వహించి మారీ కాజేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
 
 
 స్వాహాలో మచ్చుకు కొన్ని

వర్క్ ఐడీ నంబర్ 091240 102003170002 టూకీ మాను కుంటకు రూ.9.43 లక్షలు మంజూరైతే అందులో రూ.4.80లక్షలు స్వాహా చేశారు.
►  091240102003170003 నం బర్‌లోలో అడ్డదారి కుంటకు రూ.7.98 లక్షలు మంజూరైతేరూ.2.60 లక్షలు, 091240102003170004లో ఎర్ర చేను కుంటకు రూ.8 లక్షలు మంజూరైతే రూ.3.50లక్షలు స్వాహా జరిగింది
.
►  091240102003170005 లో నాగభైరవ కుంటకు రూ.8.88లక్షలు మంజూరైతే ఇప్పటికి రూ.2.80 లక్షలు స్వాహా జరిగింది.  0912401 02003170006లో చిన్న ఎర్రకుంటకు రూ.9 లక్షలు మంజూరైతే రూ.3 లక్షలు దిగమింగినట్లు ఆరోపణలున్నాయి. 091240102003170154లో బిక్కాయల కుంటకు రూ.6.70 వేలు మంజూరైతే రూ.1.64 లక్షలు స్వాహా చేశారు.

మరిన్ని వార్తలు