ముగిసిన ఆటలు..ఆకట్టుకున్న ‘ఔట్‌రీచ్’

29 Oct, 2013 03:40 IST|Sakshi

కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 17వ తేదీ నుంచి మెడికోలు నిర్వహిస్తున్న ఉత్కర్ష్-2013 కార్యక్రమంలో సోమవారంతో ఆటల పోటీలు ముగిశాయి. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో, షాట్‌పుట్, బాస్కెట్‌బాల్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటల్లో ఫైనల్స్ జరిగాయి. దాదాపు అన్ని విభాగాల్లోనూ రీగన్స్ బ్యాచ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మెడికోల బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ నవ్వుల్లో ముంచెత్తింది. కళాశాల ప్రాంగణంలో అరేలియన్ బ్యాచ్ డిజైన్ చేసిన ఉత్కర్ష్-2013 లోగో అందరినీ ఆకట్టుకుంది.
 
మ్యూజియం సందర్శన
 
స్కూల్ ఔట్‌రీచ్ ప్రోగ్రాంలో భాగంగా మెడికోలు ఎంపిక చేసిన 30 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 200మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సోమవారం కేఎంసీకి చేరుకుని అనాటమీ, ఫోరెన్సిక్ మ్యూజియంలను సందర్శించారు. మెడికోలు వివరించిన పలు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్‌దరక్, సంబంధిత విభాగాల హెచ్‌ఓడీలు మానవ శరీర అవయలవాలను చూ పిస్తూ వాటి ప్రయోజనాలను, అవి పనిచేసే విధానాన్ని విద్యార్థులకు తెలిపారు.

అనంతరం ఫోరెన్సిస్ విభాగంలో మెడికోలు విద్యార్థులకు పలు ఆసక్తికరమైన అంశాలను వివరిం చారు. వేలిముద్రలు కనుగొనే విధానం, ఐడెం టిఫిటికేషన్, డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మెడికోలు విద్యార్థులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశా రు. ఔట్‌రీచ్ ప్రోగ్రాంలో భాగంగా అత్యంత ప్రతిభ కనబరిచిన  విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ భవన్‌లో కళాశాల ప్రిన్సిపాల్  ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందించారు.
 

>
మరిన్ని వార్తలు