ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట

20 Jun, 2014 01:55 IST|Sakshi
  •     నగర విద్యార్థుల హవా
  •      వరుసగా 3, 4, 5 ర్యాంకులు
  • ఏయూ క్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్2014లో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. గురువారం సా యంత్రం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.

    గణితం విభాగంలో ఆర్‌ఆర్ వెంకటాపురానికి చెందిన వై.లక్ష్మీ అనసూయ 104 మార్కులతో తృతీయ స్థానంలో నిలి చారు. బయాలాజికల్ సెన్సైస్స్‌లో బుచ్చిరాజుపాలేనికి చెందిన బి.పవనకీర్తి 105 మార్కులతో నాల్గవ స్థానాన్ని, పెదబొడ్డేపల్లికి చెందిన సీహెచ్.గౌతమ్ 104 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను కైవ సం చేసుకున్నారు.

    విశాఖ జిల్లా పరిధిలో మొ త్తం 5,791 మంది దరఖాస్తు చేయగా 4,965 మంది పరీక్షకు హాజరై 4,911 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 98.91 శాతం విద్యార్థు లు అర్హత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సిం హాచల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకం గా మెడికల్, ఇంజినీరింగ్ తరహా విద్యాసంస్థలను నిర్వహించే ఆలోచన ఉందన్నారు.

    టీటీడీ తరహాలో విద్యారంగాన్ని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. ఏయూకు సెంట్రల్ హోదా కల్పనపై చర్చ జరుగుతుందని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి 11 జాతీయ విద్యా సంస్థలను మూడు ప్రాంతాలకు సమానంగా అందిస్తామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికి, ముఖ్యంగా ఏయూ పూర్వ విద్యార్థిగా మంత్రి గంటాపై వర్సిటీ ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

    వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలను ఏయూ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఎటువంటి బాధ్యతనైనా నిర్వహించడానికి తా ము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మా వెంకటరావు పరీక్ష నిర్వహణ తీరును వివరించారు.

    కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు సీహెచ్.వి.రామచంద్రమూర్తి, ఆర్.సత్యరాజు, డీన్ టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి, ఆచార్య జి.నాగేశ్వరరావు, వి.వల్లీకుమారి, కె.రాంజీ, రాఘవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
     
     చదివించి రాశానంతే...

     గోపాలపట్నం : చదివింది రాశానంతే... పదవర్యాంకు లోపు వస్తుందని ఆశిస్తే మూడవ ర్యాంకు వచ్చిందని బీఈడీ(మేథ్స్)లో మూడో ర్యాంకు సాధించిన వై.లక్ష్మీఅనసూయ సంతోషం వ్యక్తం చేసింది. తన తండ్రి వై.ఎల్.ఎన్.శర్మ రిటైర్డు ఉపాధ్యాయునిగా సేవలందించారని, తానూ ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకుంటున్నట్టు చెప్పింది.   భవిష్యత్తులో లెక్చరర్‌ని కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు