ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం

31 Aug, 2015 01:39 IST|Sakshi
ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం

♦ బలవంతపు భూసేకరణను విరమించుకోవాలి
♦ ఇసుక అక్రమ రవాణాపై చర్యలు శూన్యం
♦ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలి
♦ బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి
 
 నెల్లూరు (టౌన్) : నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి విమర్శించారు.

 స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.70లు ఉన్న కందిపప్పు రూ.170, రూ.55లు ఉన్న మినపప్పు రూ.140లు, రూ.15లు ఉన్న ఉల్లిపాయలు రూ.60 నుంచి 70 ంరకు పెరిగాయన్నారు. జిల్లా కలెక్టర్ పనిఒత్తిడి భారంతో ధరలను నియంత్రించలేక పోతున్నారన్నారు. బ్లాక్‌మార్కెట్‌పై దాడులు చేయాల్సిన విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

పండ్లుల్లో సైతం కార్బోహైడ్రోడ్‌లు కలుపుతున్నా జిల్లాలో త నిఖీలు చేసిన సందర్భాలు లేవని తెలిపారు. బలంతపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కోరారు. జిల్లాలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుందన్నారు. జిల్లాలో అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్రపార్టీతో కలసి ప్రధానమంత్రి మోదీని కలసి విన్నవించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపి నాయుకులు మిడతలరమేష్, శ్రీనివాసులగౌడ్, శ్రీనివాసులరెడ్డి, మధు,వెంకటరత్నయ్య, వంశీధరరెడ్డి, మొద్దుశ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు