మార్కెట్ యార్డుల్లో సీబీఐ తనిఖీలు

14 May, 2015 03:40 IST|Sakshi
మార్కెట్ యార్డుల్లో సీబీఐ తనిఖీలు

క్రోసూరు : క్రోసూరు మార్కెట్ యార్డులో బుధవారం సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో సీసీఐ ద్వారా జరిగిన పత్తి కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ ఏడాది మార్కెట్ యార్డులో సీసీఐ రూ.3.25 లక్షల మేర పత్తి కొనుగోళ్లు చేసింది. వీటికి సంబంధించి రికార్డులు స్వాధీన పరుచుకున్నారు. పత్తి ఎంతమేర యార్డుకు చేరుకుందో వాటికి సంబంధించి రికార్డులు, వేబిల్లులు, రైతు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు, సేల్స్ రికార్డులు, వేబ్రిడ్జి తూకాల బిల్లులు స్వాధీన పరుచుకున్నట్లు తెలిసింది.

ప్రతి ఏటా మార్కెట్‌యార్డులో రైతుల పేరుతో పత్తి కొనుగోళ్లు చేసేది తక్కువని, అంతా బ్రోకర్ల ద్వారా యార్డుకు చేరుకున్నవేనని కొందరు రైతులు సీబీఐ అధికారులకు తెలిపారు. పాస్ పుస్తకాల జిరాక్సు కాపీలు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ బ్రోకర్ల నుంచి సీసీఐ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.
 
పిడుగురాళ్ల యార్డులో తనిఖీలు
పిడుగురాళ్ల రూరల్ : స్థానిక వూర్కెట్ యూర్డులో సీబీఐ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలు జరిగిన వూర్కెట్ యూర్డులు అన్నింట్లోనూ తనిఖీలు నిర్వహించారు. వాటికి సంబంధించి చెక్ బుక్‌లు, బిల్ పుస్తకాలు, రైతులకు ఇచ్చిన బిల్లులను, యూర్డుకు సంబంధించిన రిజిష్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 6 గంటలపాటు రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, దీనిపై  వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన విలేకరులపై సీబీఐ అధికారులు విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు