మార్కులు తక్కువ వచ్చాయని..

28 Nov, 2015 03:44 IST|Sakshi
మార్కులు తక్కువ వచ్చాయని..

విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయుడు
 రాజాం:
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మార్కులు తక్కువగా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థిని చితక్కొట్టాడు. ఈ సంఘటన రాజాంలో శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎల్‌ఐసీ కార్యాలయం వెనుక నివసిస్తున్న గుల్లల రాజ్‌కుమార్ సారధి రోడ్డులో ఉన్న ఓ కాన్వెంట్‌లో పదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం నిర్వహించిన యూనిట్ పరీక్ష ఫిజిక్స్ సబ్జెక్టులో 25కు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఈ సబెక్టు బోధించే ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది.
 
  రాజ్‌కుమార్‌ను ఒల్లంతా తట్టులు తేరేలా కర్రతో కొట్టారు. తండ్రి మృతి చెందడం, తల్లి ఇంటికే పరిమితం కావడంతో విషయాన్ని సాయంత్రం తమ బంధువులకు చెప్పాడు. వారుసంబంధిత ఉపాధ్యాయుడిని ఫోన్‌లో సంప్రదించగా దిక్కున్నచోట చెప్పుకోమన్నారని విద్యార్థి, అతని బంధువులు ఆరోపించారు. కాగా దెబ్బలు తిన్న రాజ్‌కుమార్‌ను బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుడు కరణం హరిబాబునాయుడు చికిత్సనందించి పోలీసులకు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు