సీఎం కాన్వాయ్ లో అత్యంత ఖరీదైన కార్లు

15 Oct, 2013 17:20 IST|Sakshi
సీఎం కాన్వాయ్ లో అత్యంత ఖరీదైన కార్లు

హైదరాబాద్: రోమ్ నగరం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడన్న సామెత అచ్చంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్రక్క రాష్ట్ర విభజన.. మరో ప్రక్క సీమాంధ్రలో ఉద్యమ సెగలు. వీటితో రాష్ట్రం తగలబడి పోతుంటే.. సీఎం కి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. వీటన్నంటినీ పక్కన బెట్టారు. దసరా కానుకుగా తనకు తానే రెండు కార్లను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాకున్నారు. కాన్వాయ్ లోకి కొత్త కార్ల కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో  అధికారులు  3 ల్యాండ్‌ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు.

 

వీటి విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయిలు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికి ఇప్పడే ఇంత ఖరీదు పెట్టి కార్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనేది ప్రధానంగా చర్చకు దారి తీసింది. సడన్ గా సీఎం గారికి కొత్త కార్లపై ఎందుకు మోజుకు కల్గిందో కానీ..   ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కార్లను కొనుగోలు చేసి  ప్రజాధనాన్నిదుర్వినియోగం చేయడం ఏమాత్రం సబబు కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా