అధికార బలుపు

17 Sep, 2014 02:35 IST|Sakshi
ఆయనో తెలుగుదేశం పార్టీ నాయకుడు. జిల్లా కేంద్రంలో న్యాయ కళాశాల నిర్వాహకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరుల్లో ఒకడు. ఆయన నిర్వహిస్తున్న న్యాయ కళాశాల పరీక్షా కేంద్రం యోగి వేమన
 యూనివర్సిటీకి మారింది. మాస్ కాపీయింగ్‌కు బ్రేక్ పడింది. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మిప్రసాద్‌కు ఫోన్ చేసి నోటి కొచ్చినట్లు దూషించాడు. నీ.. అంటూ
 మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించాడు. 
 నరికిపారేస్తా నా... అంటూ రెచ్చిపోయాడు. ఆ అధికారి దళితుడనే
 
 సాక్షి ప్రతినిధి, కడప:  మంగళవారం మధ్యాహ్నం సమయం 12 గంటలు... అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్ ఫోన్ రింగ్ అయింది. హలో అంటూ రీసివ్ చేసుకున్నారు. లక్ష్మీప్రసాదేనా.. అవునండీ మీరెవరూ... గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతున్నా... నా కొ.. ల్లారా పరీక్షలు అంత దూరంలో పెట్టారు. పరీక్షలు రాసేందుకు వస్తూ ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురైనారు. ఇంతవరకూ మీరెవర్వూ చూసేందుక్కూడా రాలేదు. నీ .. మీ ఇష్టమెచ్చినట్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటూ పరుష పదజాలంతో దూషణలకు దిగాడు.  ఏమండీ..ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు... మర్యాదగా మాట్లాడండి..అనగానే.. వెంటనే నరికేస్తా నా... రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం మాదే. నీ ఇష్టమొచ్చినట్లు పరీక్షలు నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్నా ...అంటూ ఆగకుండా దూషణలకు దిగాడని బాధితుడు వాపోయారు. వైవీయూ రిజిస్ట్రార్ వాసంతికి బాధితుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకపోవడంతోనే....
 బసవతారకం మెమోరియల్ లా కళాశాలలో తమిళనాడుకు చెందిన విద్యార్థుల అడ్మిషన్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం పరీక్షల్లో పాస్ గ్యారెంటీ ఇవ్వడంతోనే ప్రతి ఏడాది అక్కడి నుంచి అడ్మిషన్లు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈసారి పరీక్షా కేంద్రాన్ని వైవీయూలోనే నిర్వహిస్తున్నారు. దాంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం రాబోవు ఏడాది అడ్మిషన్లపై పడే అవకాశం ఉంది. దాంతో ఒక్కమారుగా గోవర్ధన్‌రెడ్డి కోపం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. 
 దుర్మార్గంగా దూషించారు: లక్ష్మీప్రసాద్
 ‘పరీక్షా కేంద్రం నుంచి డిపార్టుమెంట్‌కు వెళ్లగానే ఫోన్ కాల్ వచ్చింది. రీసీవ్ చేసుకోగానే బూతులు అందుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని  కుటుంబసభ్యుల్ని దూషించారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇదే విషయాన్ని నా సహచరులకు చెప్పాను. సంఘీభావం ప్రకటించారు. రిజిస్ట్రార్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. దళితుడిననే చిన్నచూపుతో కులం పేరుతో దూషించారు.  అని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
 విధులు బహిష్కరించాలని నిర్ణయం... 
 అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి దూషించడంపై చర్యలు తీసుకోవాలని బుధవారం నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్యలు తీసుకోని పక్షంలో విధులకు హాజరయ్యేది లేదని సిబ్బంది అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
 
 
 
 
మరిన్ని వార్తలు