లైంగికదాడి కేసులో మరో నలుగురి అరెస్టు

9 Jul, 2015 04:06 IST|Sakshi
లైంగికదాడి కేసులో మరో నలుగురి అరెస్టు

పోలీసుల అదుపులో మొత్తం ఏడుగురు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ సౌజన్య
 
 తెనాలిరూరల్ : ప్రేమజంటను అటకాయించి, యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్టయింది. డీఎస్పీ సీహెచ్ సౌజన్య తన కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను తెలియజేశారు. వేమూరు నియోజకవర్గలోని కొల్లూరుకు చెందిన యువతి ప్రేమికుడు రాజేష్‌తో కలసి జూన్ 26వ తేదీ రాత్రి లారీలో వేమూరు వచ్చింది.

రైల్వే గేటు వద్ద వారిని రేపల్లెకు చెందిన అడుసుమల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, భూపతి గోపి అటకాయించారు. తాము పోలీసులమని బెదిరించడంతో ఐడీ కార్డులు చూపించమని ప్రేమ జంట అడిగింది. దీంతో వారు సమీప పొలాల్లో అప్పటికే మరో యువతితో గడుపుతున్న ఆర్మీ జవాను రాతంశెట్టి సుధాకర్, భూపతి వెంకటరత్నంలకు ఫోను చేసి పిలిపిం చారు. సుధాకర్ తన ఐడీ కార్డు చూపించి పోలీసులుగా నమ్మించి, ఆ మరుసటి రోజు భట్టిప్రోలు పోలీస్‌స్టషన్‌కు రమ్మని రాజేష్‌తో చెప్పి, అతడి వెంట ఉన్న యువతిని వెంకటేశ్వరరావు మోటారుసైకిల్‌పై ఎక్కించి రావికంపాడు సమీప పొలాల్లోకి తీసుకువెళ్లారు.

ఆందోళనపడిన రాజేష్ వెంటనే 100కు ఫోను చేసి సమాచారం అందించారు. వేమూరు పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. అయితే అప్పటికే వెంకటేశ్వరరావు, సుధాకర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గోపి, రత్నం అంతకుముందే వారు తెనాలి నుంచి తీసుకొచ్చిన యువతి దగ్గర ఉన్నారు. వీరికి కొద్ది దూరంలో గూడవల్లి వెంకటప్రసాద్, నెల్లూరు అనిల్‌కుమార్ కాపలా ఉన్నారు. మొదట ఈ కేసులో నలుగురిని నిందితులుగా భావించామని, దర్యాప్తులో మరో ఇద్దరు కాపలా ఉన్న విషయం తేలిందని డీఎస్పీ చెప్పారు. 

ఘటన జరిగిన మరుసటి రోజే వెంకటేశ్వరరావు, సుధాకర్, వారితో ఉన్న యువతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, గోపి, వెంకటరత్పంలను 7వ తేదీన, వెంకటప్రసాద్, అనిల్‌కుమార్‌ను 8వ తేదీన రేపల్లెలో అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు.నిందితులపై కిడ్నాప్, మో సం,ఇంపర్సనేషన్, లైంగికదాడి, నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసిన తాలూకా సీఐ యు.రవిచంద్ర, కొల్లూరు, వేమూరు ఎస్‌ఐలు ఎ. వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌ను డీఎస్పీ అభినందించారు.

>
మరిన్ని వార్తలు