పార్టీ నిర్ణయమే శిరోధార్యం

15 Dec, 2013 03:31 IST|Sakshi

రాపూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ నిర్ణయమే తనకు శిరోధార్యమని  ఆ పార్టీ సీఈసీ సభ్యుడు పాపకన్ను రాజశేఖరరెడ్డి అన్నారు. సీఈసీ సభ్యునిగా ఎంపికయ్యాక మొదటిసారి ఆయన శనివారం రాపూరుకు వచ్చారు. పాపకన్ను అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 తనకు పదవి ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు సమ న్వయకర్త మేకపాటి గౌతమరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ ఎవరికి బీఫారం ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని పాపకన్ను స్పష్టం చేశారు. తనకు పదవి ఇచ్చిన పార్టీకి గౌరవం తీసుకొస్తానన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సహించనన్నారు. తనకు అప్పగించిన పదవికి వన్నె తెస్తానన్నారు. పార్టీ నాయకులందరినీ కలుపుకుపోవాలని సూచించారు. తాను ఎలాంటి పదవులు (ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో లేనని) ఆశించడం లేదని చెప్పారు.
 
 జగన్ సీఎం కావడం తథ్యం: మేరిగ
 రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. పాపకన్ను రాజశేఖరరెడ్డి సీఈసీ సభ్యునిగా నియమితులై తొలిసారి రాపూరుకు వచ్చిన సందర్భంగా పాపకన్ను అతిథి గృహంలో విలేకరుతో మాట్లాడుతూ జిల్లాలోని 10 స్థానాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. పాపకన్ను రాజశేఖరరెడ్డి క్రమశిక్షణ కలిగిన రాజకీయనేతన్నారు. ఈ సమావేశంలో రాపూరు, గోనుపల్లి సర్పంచ్‌లు శ్రీదేవి, శారద  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు