పోలీసులను ద్వేషించే వారే అధికం

24 Oct, 2013 01:58 IST|Sakshi

=మంత్రి సారయ్య సహృదయుడు, వినయశీలి
 =ప్రస్తుతం పుస్తకాలు రాస్తున్నా..
 =రిటైర్‌‌డ డీజీపీ అరవిందరావు
 =ఆయన సలహాలతోనే తప్పులు దిద్దుకున్నా : మంత్రి సారయ్య

ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :  పోలీసులను ప్రేమించే వారి కంటే ద్వేషించే వారే అధికంగా ఉంటారని రిటైర్‌‌డ డీజీపీ అరవిందరావు అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో అరవిందరావు ఆత్మీయ అభినందన సభ జరిగింది. బుధవారం జరిగిన ఈ సభలో తొలుత తనను ఇష్టపడే వారు ఇంతమంది ఉండడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్‌లో ఎస్పీగా పనిచేయడం తన సర్వీసులో ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు.

కాగా, పోలీసు వృత్తిలో ఉన్న వారు కొన్ని సం దర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ఫలి తంగా ఎందరికో ద్వేషభావం పెరుగుతుందని తెలిపా రు. అయితే, తాను ఇక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడే సారయ్యకు ఏం సలహాలు చెప్పానో గుర్తు లేదు కానీ తనను గురువుగా భావించి అభినందన సభ ఏర్పాటుచేయడం ఆయనలోని సహృదయతను సూచిస్తోందని పేర్కొన్నా రు. అలాగే, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నానని చెప్పడం సారయ్యలోని మార్పు, ఎదుగుదలకు నిదర్శమని అరవిందరావు కొనియాడారు.
 
అధికారిగా ఎన్నో సలహాలు ఇచ్చారు...

చిన్న స్థాయి నుంచి వచ్చిన తాను మంత్రిగా ఎదగడం లో పోలీసు అధికారిగా అరవిందరావు ఇచ్చిన సల హాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని బస్వరాజు సారయ్య అన్నారు. ఉమ్మారెడ్డి, సురేందర్‌రెడ్డి రాజకీయ గురువులైతే.. అరవిందరావు అధికారిగా తన ఎదుగుదలకు తోడ్పడ్డారన్నారు. తనను కుమారుడిలా భావించే అరవిందరావు ఎస్పీగా పనిచేసిన సమయంలో సామాన్య ప్రజలు వచ్చినా వారి సమస్యలను సావధానంగా వినేవారని తెలిపారు.

తాను మంత్రిగా కాకుండా మాములు సారయ్య మాదిరిగా అభినందన సభ ఏర్పాటుచేశానని వివరించారు. కేంద్ర సామజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో పని చేసిన అధికారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ పోలీసులను ప్రజలకు చేరువ చేయడంలో అరవిందరావు చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లా కలెక్టర్ జి.కిషన్ మాట్లాడు తూ ప్రజా సంబంధాల పెరుగుదలకు అరవిందరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

సభలో జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు, నిట్ డెరైక్టర్ శ్రీనివాస్, రూరల్, అర్బన్ ఎస్పీలు పాలరాజు, వెంకటేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారా వు, మందాడి సత్యనారాయణరెడ్డి, దుగ్యాల శ్రీనివాస్‌రావు, కుడా మాజీ చైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎంబాడి రవీందర్, బస్వరాజు శ్రీమాన్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, హరిరమాదేవి, పలువురు నాయకులు, డాకర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు