పేదలకు ధీమా బీమా

17 Nov, 2014 04:17 IST|Sakshi

ఊహించని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అండగా నిలిచేది బీమా పథకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే పాలసీలు అనేకం అందుబాటులో ఉన్నాయి. గతంలో బడుగు, బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ప్రభుత్వం పలు పథకాల కింద మహిళలు, వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. నగరవాసులకైతే జీవీఎంసీ యూసీడీ విభాగం, జిల్లా వాసులకైతే  డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇందిరాక్రాంతి పథకం ద్వారా పలు బీమా పథకాలు పొందవచ్చు. ఆ వివరాలు... - ద్వారకానగర్
 
అమ్‌ఆద్మీ యోజన...
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 18 నుంచి 59 ఏళ్ల వరకు భూమిలేని నిరుపేద గ్రామీణ వ్యవసాయ కూలీలు రూ.15ల సేవా రుసుం చెల్లిస్తే ప్రభుత్వం రూ. 320 జత చేసి బీమా కంపెనీలకు రూ. 335 చెల్లిస్తుంది. ఏటా రూ.15తో పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. ప్రమాదం లేదా సాధారణ మరణమైనా తక్షణ సహా యంగా రూ.5వేలు అందజేస్తారు. తర్వాత రూ.25 వేలు చెల్లిస్తారు.
 
వైఎస్సార్ అభయ హస్తం
గ్రామ సమాఖ్యలో సభ్యత్వంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. వరుసగా రెండేళ్లు వాటా ధనం చెల్లించకపోతే స భ్యుత్వం రద్దవుతుంది. రోజు రూ.  రూపాయి చొప్పున ఏడాది పొడవునా అభ్యర్థి రూ.365 జమ చేస్తే అంతే ప్రీమియం ప్రభుత్వం చెల్లించి బీమా సదుపాయం కల్పిస్తుంది. వరుసగా పదేళ్లు వాటాధనం చెల్లిస్తే కనీసం రూ. 500 పింఛను పొందేందుకు అర్హత లభిస్తుంది.

వృద్ధాప్యంలో పింఛనుతో పాటు బీమా సదుపాయం ఉంటుంది. సహజ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యానికి పరిహా రం పొం దే అవకాశం ఉంటుంది. సభ్యుత్వం పొందిన కుటుంబంలో 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఉంటే ఏటా రూ.1200 ఉపకారం వేతనం అందుతుంది.
 
జనశ్రీ...
స్వయం సహాయక సంఘాల సభ్యులు 18 ఏళ్లు పైబడిన వారు ఈ బీమాలో చేరవ చ్చు. ప్రతి ఒక్కరూ ప్రీమియం రూ.17 సేవా రుసుం రూ.15లు చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.360లు కలిపి బీమా చేస్తుంది. అభయహస్తంలో చేరి ఉంటే సర్వీసు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదు.
 
అప్పు బీమా..
మహిళ సంఘాల్లో సభ్యత్వం పొందిన మహిళలు బ్యాంకు రుణం పొందిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ అప్పు భారాన్ని కు టుంబ సభ్యులు చె ల్లించాల్సి వచ్చేది. ఆ పరిస్థి తి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్పు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అప్పు తీసుకున్న సభ్యురాలు ప్రతి రూ.1000కి రూ. 4.50 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం తీసుకున్నా తర్వాత మృతిచెందితే ఆమె చెల్లిం చాల్సిన రుణం మాఫీ చేస్తారు. అప్పటి వరకు చెల్లించిన వాయిదాలు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
 
కార్మిక బీమా..: భవన నిర్మాణ రంగంలోని కూలీలు, మేస్త్రీలు తక్కువ ప్రీమియంతో బీమా పొందే వీలుంది. మొదటి సంవత్సరం ప్రవేశరుసం రూ.50, అదనంగా మరో రూ.12 చొ ప్పున రూ.62 చెల్లించాలి.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షల పరిహారం పొందవచ్చు. అయితే ఏటా ప్రీమి యం చెల్లిస్తూ పాలసీని రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉం టుంది.  సహజమరణమైతే రూ.30వేలు, పని చేసే చోట చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5వేలు అందిస్తారు.

మరిన్ని వార్తలు