ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు

3 Jun, 2016 03:51 IST|Sakshi
ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు

పార్టీ బలపడాలంటే తప్పదని మంత్రి నారాయణ ప్రతిపాదన
చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్
జిల్లా టీడీపీపై మంత్రి ఆధిపత్యం
►  మండిపడుతున్న పార్టీ సీనియర్లు

 
 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల బాధ్యతలు ఆనం కుటుంబానికి అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది. నెల్లూరురూరల్ నియోజకవర్గం బాధ్యతలు మంత్రి నారాయణకు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రెండు నియోజకవర్గాల మార్పులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బల హీన పరచడం కోసం రెండేళ్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీకి ఉపయోగం లేకుండా పోయింది. మండల, గ్రామ స్థాయి నాయకులను సైతం ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకుంటున్నా ఆశించిన ఫలి తం కనిపించడం లేదు. అధికారం చేప ట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పార్టీ ని గాడిన పెట్టలేక పోవడంపై చంద్రబాబు నాయు డు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

 జిల్లాలో పార్టీని పటిష్ట పరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ సమయం కేటాయించాలని మంత్రి నారాయణను ఆదేశించారు.ఇందులో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నారాయణ తన భుజానికెత్తుకోవడానికి సిద్ధపడ్డారు. ఆత్మకూరుకు రామనారాయణరెడ్డిఆత్మకూరులో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పార్టీని బలంగా తయారు చేయడంలో వెనుక పడుతున్నామని చంద్రబాబు అసహనంగా ఉన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించే ఆలోచనతోనే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. ఆత్మకూరు మీద దృష్టి పెట్టి పనిచేయాలని రామనారాయణరెడ్డికి చంద్రబాబు సూచించారు. అయితే రామనారాయణరెడ్డి పెత్తనాన్ని ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ గూటూరు కన్నబాబు వ్యతిరేకిస్తున్నారు.

పార్టీకోసం మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా అవసరాల కోసం పార్టీలు మారిన వారికి బాధ్యతలు ఇస్తే తామెలా పనిచేస్తామని అంతర్గత చర్చల్లో ఆయన తన మనసులోని ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అధికారికంగా బాధ్యతలు ఇవ్వనందువల్ల రామనారాయణరెడ్డి ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. నియోజకవర్గంలో తన మద్దతుదారుల వ్యక్తిగత కార్యక్రమాలకు మాత్రం అడపా దడపా హాజరవుతున్నారు. రామనారాయణరెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోచేరిన ఆయన మద్దతు దారులు సైతం టీడీపీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు.

ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇక మూడేళ్లే సమయం ఉన్నందువల్ల పార్టీని బలంగా తయారు చేసుకోవడం కోసం రామనారాయణరెడ్డికి అధికారింకగా బాధ్యతలు అప్పగిద్దామని చంద్రబాబుకు మంత్రి నారాయణ సూచించారని విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఈ పని కానివ్వాలని, ఆలోపు కన్నబాబును కూడా కూర్చోబెట్టి ఇద్దరు కలిసి పనిచేసేలా సర్దుబాటు చేయాలని నారాయణను చంద్రబాబు ఆదేశించారు.

మరిన్ని వార్తలు