మూడు రాష్ట్రాల బంధం

5 Jan, 2014 05:18 IST|Sakshi

మోర్తాడ్, న్యూస్‌లైన్ :
 తమిళనాడు బాతులకు మన గడ్డ అడ్డా అయ్యింది. ఈ బాతుల గుడ్లు మాత్రం కేరళకు ఎగుమతి అవుతున్నాయి. ఇలా మూడు రాష్ట్రా ల వారధిగా ఇందూరు జిల్లా నిలుస్తోంది. ఖరీ ఫ్ సీజన్ వరి కోతలు పూర్తయ్యే సమయానికి తమిళనాడుకు చెందిన బాతుల యజమానులు వాటిని తీసుకొని మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాలకు వస్తారు. ఇలా వేలాది బాతులను తీసుకొని వంద మంది వరకు ఇక్కడికి వచ్చి, టెం ట్లు వేసుకొని నివసిస్తారు. బాతుల మందలను పొలాల్లో తిప్పుతారు. అవి రాలిపోయిన గింజ లను ఏరుకుని తింటాయి. బాతుల గుడ్లను కేరళ రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. అక్కడ బాగా చలిగా ఉంటుందని, బాతుగుడ్లు శరీరంలో వేడిని పెంచుతాయ ని బాతుల యజమాని సురేశ్‌రాజ్ ‘న్యూస్‌లైన్’తో తెలిపారు. ఒక్కోబాతు వారానికి మూడునుంచి నాలుగు గుడ్లు పెడుతుందన్నారు. గుడ్లను వారానికోసారి కేరళకు తరలిస్తామని, అక్కడ ఒక్కో గుడ్డును రూ. 5కు విక్రయిస్తామని పేర్కొన్నారు. తమిళనాడుకు ఇక్కడికి వాతావరణంలో తేడా ఉంటుం దని అందుకే శీతాకాలంలో బాతులను ఇక్కడికి తీసుకొని వస్తామని తెలిపారు. ఒక్కోగ్రామంలో వారం పదిరోజులు ఉంటామని, తర్వాత బాతులకు మేతకోసం మరో గ్రామానికి వెళ్తామని వివరించారు.

మరిన్ని వార్తలు