'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం'

28 Nov, 2014 17:47 IST|Sakshi

విశాఖ: హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాలుగు జిల్లాల్లో తుపాను నష్టం రూ. 21, 908 కోట్లు జరిగినట్లు అంచనా వేసి ఆ నివేదికను కేంద్ర కమిటీలోని సభ్యులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకూ రూ. 7,500 కోట్లను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు ప్రత్తిపాటి స్పష్టం చేశారు.


కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే  కేంద్ర బృందాలు గురు, శుక్రవారాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి.

మరిన్ని వార్తలు