పైకప్పు కూలి - వ్యక్తి దుర్మరణం

22 Nov, 2015 09:18 IST|Sakshi


ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో ఇంటి పైకప్పు భాగం కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన జరిగింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి (45) నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో... వర్షానికి బాగా నానిన పైకప్పు కొంత భాగం భాగం ఊడి మీద పడింది. తీవ్రంగా గాయపడిన అతడు మంచంపైనే ప్రాణాలు వదిలాడు. వర్షాలతో ఈ గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో దాసరి కొండమ్మ (80) చలిగాలులు తట్టుకోలేక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా