బిడ్డ వెంటే తల్లి..

31 May, 2016 01:28 IST|Sakshi

ప్రసవానంతరం ఒకే సారి తల్లి, బిడ్డ మృతి 
శ్యామగెడ్డలో విషాదం



వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం.. రహదారులకు నోచుకోకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా సోమవారం పురిటినొప్పులతో ఓ గర్భిణి అందుబాటులో ఉన్న నాటు వైద్యుడిని ఆశ్రయించడంతో ప్రసవానంతరం తల్లీ బి డ్డలు ఒకే సారి మృతిచెందారు.

 

జీకేవీధి : మన్యంలో మాతా, శిశు మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. మండలంలోని పనసలబందలో ప్రసవ సమయంలో బాలింత మృతి చెందిన సంఘటన మరువక ముందే తాజాగా శ్యామగెడ్డలో సోమవారం తెల్లవారుజామున తల్లీబిడ్డ మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్యామగెడ్డ గ్రామానికి చెందిన వనుగూరి లక్ష్మయ్య భార్య వనుగూరి కుమారి (32) 7 నెలల గర్భవతి. ఆమెకు అన్ని రకాల వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో వేశారు. ప్రసవ సమయం మరో రెండు నెలలు ఉన్నప్పటికీ సోమవారం తెల్లవారున  పురిటి నొప్పులు వచ్చాయి.  మారుమూల గ్రామం కావడం, రహదారి సౌకర్యం లేకపోవడంతో వీరు నాటు ైవె ద్యుడిని ఆశ్రయించారు.  ఆమె బిడ్డను ప్రసవించినప్పటికీ తల్లి, బిడ్డా ఒకేసారి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  మృతురాలు కుమారికి 5 ఏళ్ల పాప ఉంది.

 
మాతా, శిశు మరణాలు బాధాకరం

వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించినప్పటికీ మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని, ఆర్‌వీనగర్ పీహెచ్‌సీ వైద్యాధికారి నురున్నీషాబేగం అన్నారు. 2 నెలలు గడువు ఉన్నప్పటికీ ముందుగానే పురిటి నొప్పులు రావడంతో ఆమె మృతి చెందిందని ఆమె తెలిపారు.

>
మరిన్ని వార్తలు