తప్పెవరిది?...శిక్ష ఎవరికి?

23 Sep, 2014 00:43 IST|Sakshi
తప్పెవరిది?...శిక్ష ఎవరికి?
  • ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌పై సందిగ్దం
  •  విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా ‘సాక్షి’
  •  నేడు అవగాహన సదస్సు
  • తేదీ    :    సెప్టెంబర్ 23 (మంగళవారం)
    సమయం    : ఉదయం 10 గంటల నుంచి
    వేదిక    :    వైశాఖి ఫంక్షన్ హాల్, విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనం,సూర్యాబాగ్ (పోలీస్ బారెక్స్ సమీపాన)

     
    విశాఖపట్నం: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై సందిగ్దత తొలగకపోవడంతో రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ తరువాత భారీగా సీట్లు మిగిలిపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకువచ్చింది. ఇందుకోసం విశాఖపట్నంలో నేడు(మంగళవారం)  ప్రముఖ విద్యా, సామాజికవేత్తలతో ఇంజినీరింగ్ విద్యార్థులు, తల్లిదండ్రులతో అవగాహన సదస్సు నిర్వహించనుంది.

    ఈ సదస్సుకు  ప్రొఫెసర్ జేమ్స్ స్టిఫన్ (విస్టమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్),  ప్రొఫెసర్ బి.రాజ శరత్ కుమార్ ( లెనోరా ఇంజనీరింగ్ కాలేజ్  ప్రిన్సిపాల్), డాక్టర్ పిన్నిం టి వరలక్ష్మి( ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మె ల్యే), ఎన్.వి. బదరీనాథ్( ప్రముఖ న్యాయవాది, విశాఖపట్నం బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షు డు), ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు(సైకాలజీ వి భాగాధిపతి, ఏయూ) హాజరై విద్యార్థులకు మా ర్గనిర్దేశం చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ‘సాక్షి’ సాదర స్వాగతం పలుకుతోంది.
     

మరిన్ని వార్తలు