హత్య కేసులో నిందితుల లొంగుబాటు

11 Oct, 2013 04:07 IST|Sakshi

నర్సింహులపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పడమటిగూడెం గ్రామంలో ఈ నెల 2న జరిగిన కాంబోజీ రాములు హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయూరు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి గురువారం నిందితుల వివరాలు వెల్లడించారు. అమె కథనం ప్రకారం.. పడ మటిగూడెం గ్రామానికి చెందిన చిర్ర యూకయ్య, హన్మంతు, ఉప్పలయ్య సోదరులు. వారి సోదరితో అదే గ్రామానికి చెందిన కాంబోజ రాములు వివాహేతర సంబం ధం సాగిస్తున్నాడు. అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు.

వివాహేతర సంబంధం విషయం తెలిసి సదరు మహిళ సోదరులు పలుమార్లు రాములును హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి మాట పెడచెవిన పెట్టడంతో అతడిని మట్టుబెట్టేందుకు ముగ్గురు కలిసి పథకం పన్నారు. అక్టోబర్ 2వ తేదీ తెల్లవారుజామున రాములు బైక్‌పై పొలం వద్దకు వెళుతుండగా అప్పటికే రోడ్డుపై కాపుకాచిన ముగ్గురు అతడిని అడ్డుకుని గొడ్డళ్లతో దారుణంగా నరి కి చంపారు. అనంతరం గొడ్డళ్లను వారి పొలం వద్ద పెట్టి పరారయ్యూరు. వారి కోసం తీవ్రంగా గాలి స్తున్న క్రమంలోనే వారు పోలీసుల ఎదుట లొంగిపోయూరు.
 
నిందితులపై రౌడీషీట్  

 నిందితుడు యూకయ్య మీద పీఎస్‌లో రౌడిషీట్ ఉందని, మిగతా ఇద్దరిపై కూడా ఓపెన్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. సమావేశంలో తొర్రూరు సీఐ సార్ల రాజు, ఎస్సై వై.వీ.ప్రసాద్, పీఎస్సై రవీందర్, హెడ్‌కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రవీందర్, పీసీలు నాగేశ్వర్‌రావు, బుచ్చిరాజు, మోహన్, కృష్ణంరాజు, రమేష్, రవి, సురేష్, రమేష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు