వృద్ధురాలి సజీవ దహనంతో లక్నెపల్లిలో విషాదం

1 Jan, 2014 04:07 IST|Sakshi

నర్సంపేట, న్యూస్‌లైన్ : కొడుకు తలకొరివి పెడితే పున్నామ నరకం నుంచి బయటపడొచ్చనే విశ్వాసంతో ఓ మహిళ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. అయితే విధి వక్రించడంతో ఉంటున్న ఇల్లుకే నిప్పంటుకుని.. చితి మంటగా మారి ఆమె సజీవ దహనమైంది. తల్లి అకాల మరణంతో పెంపుడు కొడుకు రోదనలు మిన్నంటాయి.

వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట వుండలం లక్నెపల్లి గ్రావూనికి చెందిన గజ్జె కొంరవ్ము(60), కొమురమ్మ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో తలకొరివి పెట్టేందుకైనా కొడుకు ఉండాలనే విశ్వాసంతో బంధువుల కుమారుడు సమ్మయ్యను దత్తత తీసుకున్నారు. వారికి పక్కపక్కనే రెండు ఇళ్లు ఉన్నాయి. కొమురమ్మ నిద్రిస్తున్న పెంకుటింట్లో సోవువారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు ఎగిసి ఆమె సజీవ దహనమైంది.


 ఎదురుగా ఉన్న సమ్మయ్యతోపాటు చుట్టుపక్కల వారు గ్రహించి వుంటలా ఆర్పే ప్రయుత్నం చేసినా ఆరకపోవడంతో ఫైర్ స్టేషన్‌కు సవూచారం అందించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని వుంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలానికి టౌన్ సీఐ వాసుదేవరావు చేరుకుని విచారణ జరిపారు. డీసీసీ అధ్యక్షుడు దొంతి వూధవరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్‌‌జ పెద్ది సుదర్శన్‌రెడ్డి వుృతురాలి కుటుంబాన్ని పరావుర్శించారు.
 తలకొరివి పెట్టాలని కోరుకుంటివే అవ్వా..
 ‘నేను నీకు తల కొరివి పెట్టాలని కోరుకుంటివి కదా అవ్వా.. తల కొరివి పెట్టకుం డానే తగలబడితివా అవ్వా..’ అని సజీవ దహనమైన తల్లి మృ తదేహం వద్ద బోరున విలపించాడు. ఈ ఘటనతో లక్నెపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు