లోయలో పడిన మహిళ

14 May, 2014 00:28 IST|Sakshi
లోయలో పడిన మహిళ

తిరుమల: తిరుమల అవ్వాచ్చారి కోన లోయలో మంగళవారం ఓ మహిళ ప్రమాదవశాత్తు పడింది.   శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వెంకటలక్ష్మి(45) ఒంటరిగా కాలిబాటలో తిరుమలకు బయలుదేరారు.సాయంత్రం నాలుగు గంటలకు నృసింహస్వామి ఆలయానికి సమీపంలోని అవ్వాచ్చారి కోన లోయలో సుమారు 20అడుగుల లోతులో ఆమె పడి పోయారు. సమాచారం తెలియగానే విజిలెన్స్ ఏవీఎస్‌వో సాయిగిరిధర్ ఫైర్ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లారు. గాయాలపాలైన ఆమెను స్ట్రెచర్‌పై తాళ్లసాయంతో పైకి తీసుకొచ్చి తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. కాగా, తన వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు.
 

మరిన్ని వార్తలు