రోడ్డెక్కిన పొగాకు రైతులు

5 Apr, 2016 10:51 IST|Sakshi

గిట్టుబాటు ధర రావడంలేదని వర్జినియా పొగాకురైతులు వేలం నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడంలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రకృతితో యుద్ధం చేస్తూ ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తే ప్రభుత్వం గిట్టు బాటు ధర కల్పించక పోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. పంట కోసం అప్పులు చేశామని.. పరిస్థితి చూస్తే.. కనీసం వడ్డీలకు కూడా ఆదాయం సరిపోని పరిస్థితి ఉందని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకూ వేలం జరగ నిచ్చేదిలేదని స్పష్టం చేశారు.

 

>
మరిన్ని వార్తలు