నాటు ప్రాణాలకు చేటు

2 Nov, 2014 01:45 IST|Sakshi
నాటు ప్రాణాలకు చేటు
  • సీహెచ్‌ఎల్‌ఫురంలో ఒకరి బలి
  •  విచ్చలవిడిగా తయారీ, విక్రయాలు
  •  అరికట్టాలని కోరుతున్న ప్రజలు
  • మండలంలో పలు గ్రామాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. దీన్ని సేవించి పలువురు అస్వస్తతకు గురవడం, మృత్యువాత పడడం జరుగుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున చుక్కలవానిలక్ష్మీపురం గ్రామంలో కొండలరావు అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సారా విపరీతంగా సేవించడం వల్లే తమ సోదరుడు మృత్యువాత పడ్డాడని కొండలరావు సోదరుడు వైఎస్సార్ సీపీ నాయకుడు రాజబాబు, శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు.
     
    కుటీ ర పరిశ్రమలా


    సారా తయారీ కుటీర పరిశ్రమగా మారిందని, నిత్యం వందలాది లీటర్ల సారా తయారు చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్జైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలు గ్రామానికి పెద్ద తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులు అరికట్టడంతో సారా తయారీ జోరందుకుంది. ఒక్క సీహెచ్‌ఎల్‌పురంలోనే కాదు పెదతీనార్ల, చినతీనార్ల, బోయపాడు, రాజయ్యపేట, డిఎల్‌ఫురం, చినదొడ్డిగల్లు, గొడిచర్ల, రమణయ్యపేట, రేబాక, చీడిక, దోసలపాడు, గుల్లిపాడు, నెల్లిపూడి, నామవరం, గుంటపల్లి, గునిపూడి గ్రామాల్లో సారా వ్యాపారం జోరుగా జరుగుతోంది.

    గ్రామాలకు దూరంగా ఉన్న తోటల్లో, కొండగెడ్డల్లో సారా తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. చౌకగా లభించడంతో మందుబాబులు ఎగబడుతున్నారు. నాణ్యతలేని సారా తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు దృష్టి సారించకపోతే చాలామంది ప్రాణాలు పొగొట్టుకొనే ప్రమాదముందని పలువురు అంటున్నారు.

మరిన్ని వార్తలు