రాష్ట్ర ఎడ్ల పరుగు పందేల విజేత కోవూరు

14 Jan, 2015 01:51 IST|Sakshi
రాష్ట్ర ఎడ్ల పరుగు పందేల విజేత కోవూరు

కోవూరు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోవూరులో బండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీల్లో కోవూరు ఎడ్లు విజేతగా నిలి చాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ పోటీలు జరిగాయి. తొలుత జాతి ఆవుల ప్రదర్శన, అనంతరం ఎడ్ల పరుగు పందేలు నిర్వహిం చారు. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 30 ఎడ్ల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, క్రీడాభిమానులు హాజరయ్యారు.
 
రాష్ర్టస్థాయి ఎడ్ల పందేల విజేతలు వీరే
రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ బహుమతి కోవూరుకు చెందిన గాది రాజు భాస్కర్ ఎడ్ల జట్టు 7.26 నిమిషాల్లో గమ్యస్థానం చేరడంతో ప్రథమ బహుమతి రూ.15, 116 నగదు, కప్పు అందజేశారు. రెండో బహుమతి ప్రకాశం జిల్లా స్టూవర్టుపురానికి చెం దిన గాజుల శ్రావణ్‌కుమార్ ఎడ్ల జట్టు 7.30 నిమిషాల్లో చేరుకుని రెండో బహుమతిగా రూ.13,116, రోల్‌కప్పు సాధిం చింది.

మండలంలోని చెర్లోపాళెంకు చెందిన నాసిన శీనయ్య ఎడ్లు 7.39 నిమిషాల్లో మూడో స్థానం రూ.10,116, రోలింగ్ కప్పు దక్కించుకుంది. కోవూరుకు చెందిన కలగుంట ప్రభాకర్ 7.50 నిమిషాలతో ఎడ్ల జట్టుతో రూ.8,116 నాల్గో స్థానం చేజి క్కించుకుంది. తురిమెర్ల ప్రాంతానికి చెందిన ఆంజనేయ ఎడ్ల జట్టు 7.58 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుని ఐదోస్థానంలో నిలిచింది. విజేతలకు నగదు బహుమతిగా రూ.6116 అందజేశారు.
 
బహుమతి ప్రదానం
మొదటి బహుమతికి నారపరెడ్డి రాధాకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం శ్రీనివాసులురెడ్డి రూ.15,116తో పాటు వెండికప్పును అందజేశారు.  రెండో బహుమతిని దండి వీరరాఘవయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దండి సురేష్‌యాదవ్ రూ.13,116 అందజేశారు. రోలింగ్ వెండి కప్పును, మూడో బహుమతిగా గాదిరాజు ప్రభాకర్‌రావు జ్ఞాపకార్థంగా అతని తమ్ముడు గాదిరాజు భాస్కర్‌రావు రూ.10,116 అందజేశారు.

పొబ్బారెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు మల్లికార్జునరెడ్డి, నరేంద్రరెడ్డి రోలింగ్ కప్పు అందజేశారు. నాల్గో బహుమతి శినిగం ఆదిశేషయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదినారాయణ రూ. 8,116ను అందజేశారు. ఐదో బహుమతి కోవూరు బడ్ల సంఘం ఆధ్వర్యంలో రూ. 6,116 అందజేశారు. 

మరిన్ని వార్తలు