జోయాలుక్కాస్ బంగారు ఉత్సవాల విజేతలు

24 Aug, 2014 03:37 IST|Sakshi

తిరుపతి కల్చరల్/చిత్తూరు (సిటీ): తిరుప తి, చిత్తూరు నగరాల్లోని జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల విక్రయ షోరూమ్‌లలో విడివిడిగా నిర్వహించిన బంగారు ఉత్సవాల్లో భాగంగా శనివారం లక్కీడిప్ విజేతలను ఎంపికచేశారు. మొదటి బహుమతి 8 గ్రాముల బంగారు, ద్వితీయ, తృతీ య, నాలుగో బహుమతులు పొందిన వారికి ఒక్కొక్కరికి నాలుగు గ్రాముల బంగారు చొప్పున అందజేస్తారు. జోయాలుక్కాస్ షోరూమ్‌లలో గత నెల 2 నుంచి ఈనెల 20వ తేదీ వరకు  వినియోగదారుల సౌకర్యార్థం బంగారు ఉత్సవాలు నిర్వహిం చారు.

ఇందులో భాగంగా వినియోగదారు లు అందించిన కూపన్ల ద్వారా తిరుపతి, చిత్తూరు షోరూంలలో లక్కీడిప్‌లు నిర్వహించారు. తిరుపతిలో  ట్రాఫిక్ డీఎస్పీ సుబ్బన్న ముఖ్య అతిథిగా పాల్గొని  లక్కీడిప్ తీసి విజేతలను ప్రకటించారు. బిఆర్.చంద్రవేలు(రేణిగుంట) ప్రథమ బహుమ తి, ఎస్.రత్నమ్మ(తిరుపతి), దామోదర్ హసీ(పుత్తూరు), కె.హేమాద్రి(తిరుపతి) ద్వితీయ, తృతీయ, నాలుగో బహుమతు లు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ టిజె.రఫీ పాల్గొన్నారు. చిత్తూరు హైరోడ్డులోని షోరూంలో నగరపాలక సంస్థ కమిషనర్ రాజేంద్రప్రసాద్ డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. కే.వేణుగోపాల్(చిత్తూరు) మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ, నాలుగో బహుమతులను పి.హి తేష్(చిత్తూరు), పీ.శశికళ(చిత్తూరు), ఎస్.ఈశ్వరరావు(మదనపల్లె) గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ దేవదాసన్ మాట్లాడుతూ ఈనెల 28న తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్, నటుడు అల్లు అర్జున్ హైదరాబాదులోని షోరూమ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని షోరూమ్‌లలో మిగిలిన కూపన్ల నుంచి గ్రాండ్ డ్రా తీసి ఒకరిని ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఇలా ఎంపికైన వారికి బీఎండబ్ల్యూ-3 సీరీస్ కారును బహూకరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ జీసింట్, పీఆర్వో ఢిల్లీబాబు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.  విజేతలు తమ కూపన్లను మేనేజర్‌కు చూపించి బహుమతులను తీసుకుపోవచ్చని సూచించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా