యువ’ హోరు

3 Feb, 2016 01:58 IST|Sakshi
యువ’ హోరు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువతరం హోరెత్తింది. విద్యావంతుల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం హోదా ఆవశ్యకతను నొక్కి చెప్పింది. వేలాదిగా వచ్చిన విద్యార్థిలోకంతో సిక్కోలు పట్నం కిక్కిరిసిపోయింది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు, రాకపోతే  వాటిల్లే నష్టాలపై కొన్నాళ్లుగా వైఎస్సార్‌సీపీ అధినేత, యువనేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా యువభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నం, కాకినాడల్లో ఈ సదస్సులు జరగ్గా నాలుగవది మంగళవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు.

పట్టణంలోని టౌన్‌హాల్‌లో జరిగిన ఈ సదస్సుకు మంగళవారం ఉదయం నుంచే భారీగా విద్యార్థినీ, విద్యార్థులు రావడం మొదలెట్టారు. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా రెండు గంటల ముందే ప్రాంగణానికి చేరుకున్నారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా కుర్చీలు వేశారు. ఏడు రోడ్ల జంక్షన్‌లో భారీ ఎల్‌సీడీని, ప్రాంగణంలో మరికొన్ని ఎల్‌సీడీలను ఏర్పాటు చేశారు. దాదాపు గంట ఆలస్యంగా జగన్‌మోహన్‌రెడ్డి వేదిక వ ద్దకు వచ్చారు. అప్పటికే ఆ ప్రదేశం ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారిపోయింది. దీంతో సభా ప్రాంగణంలో చోటు లేక పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయట నుంచే మూడు గంటలకు పైగా నిలబడి యువభేరి కార్యక్రమాన్ని వీక్షించారు. వేదికపై జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కేవలం విద్యార్థి నాయకులు, ముగ్గురు, నలుగురు ప్రొఫెసర్లను మాత్రమే ఉంచారు. ప్రొఫెసర్లు పి.రామకృష్ణారావు, ఒ.ఎస్.ఆర్.యు. భానుకుమార్, జయారాజు, విద్యార్థి నాయకులు సలాంబాబు, సాయి వివేక్, విద్యార్థినులు స్వరూప, యామినిలు ప్రసంగించారు. అనంతరం జగన్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

మీకందరికి ఉద్యోగాలు కావాలా?వద్దా? అన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నకు.. కావాలంటూ అందరూ రెండు చేతులూ ఎత్తారు. అందుకు ఏం కావాలి? అన్న ప్రశ్నకు ప్రత్యేక హోదా అంటూ విద్యార్థులు సమాధానమిచ్చారు. హోదా వస్తే రాష్ట్రానికి కేంద్రం 90 శాతం గ్రాంటు, 10 శాతం లోను ఇస్తుందని, హోదా రాకపోతే 70 శాతం లోను, 30 శాతం గ్రాంటు వస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి విశదీకరించారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఎలా అభివృద్ధి చెందుతున్నాయో గణాంకాలతో సహా వివరించారు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న జమ్మూకాశ్మీర్‌కు రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీ ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలో గమనించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.


కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదని ఆక్షేపించారు. ప్రత్యేక హోదాపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆ సమాచారాన్ని  వైఎస్సార్‌సీపీ వెబ్‌సైట్‌లోనూ ఉంచామని చెప్పారు. జగన్ ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు కరతాళ ధ్వనులు, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రసంగం అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నందుకు వారు జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తూ తాము కూడా మీ వెంట నడుస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారంటూ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.యువభేరి దిగ్విజయం కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. యువభేరి సదస్సును ముగించుకునిజగన్‌మోహన్‌రెడ్డిరోడ్డమార్గంద్వారా కాకినాడ పయనమయ్యారు.

 దారి పొడవునా స్వాగత కటౌట్లు: విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు హైవేపై జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మార్గమధ్యలోనూ ఆయనను చూడడానికి ఆయా గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. శ్రీకాకుళంలోనూ జగన్ వస్తున్న దారుల్లో జనం బారులు తీరారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువతరం హోరెత్తింది. విద్యావంతుల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం హోదా ఆవశ్యకతను నొక్కి చెప్పింది. వేలాదిగా వచ్చిన విద్యార్థిలోకంతో సిక్కోలు పట్నం కిక్కిరిసిపోయింది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు, రాకపోతే  వాటిల్లే నష్టాలపై కొన్నాళ్లుగా వైఎస్సార్‌సీపీ అధినేత, యువనేత ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా యువభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నం, కాకినాడల్లో ఈ సదస్సులు జరగ్గా నాలుగవది మంగళవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు.

పట్టణంలోని టౌన్‌హాల్‌లో జరిగిన ఈ సదస్సుకు మంగళవారం ఉదయం నుంచే భారీగా విద్యార్థినీ, విద్యార్థులు రావడం మొదలెట్టారు. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా రెండు గంటల ముందే ప్రాంగణానికి చేరుకున్నారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా కుర్చీలు వేశారు. ఏడు రోడ్ల జంక్షన్‌లో భారీ ఎల్‌సీడీని, ప్రాంగణంలో మరికొన్ని ఎల్‌సీడీలను ఏర్పాటు చేశారు. దాదాపు గంట ఆలస్యంగా జగన్‌మోహన్‌రెడ్డి వేదిక వ ద్దకు వచ్చారు.

అప్పటికే ఆ ప్రదేశం ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారిపోయింది. దీంతో సభా ప్రాంగణంలో చోటు లేక పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయట నుంచే మూడు గంటలకు పైగా నిలబడి యువభేరి కార్యక్రమాన్ని వీక్షించారు. వేదికపై జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కేవలం విద్యార్థి నాయకులు, ముగ్గురు, నలుగురు ప్రొఫెసర్లను మాత్రమే ఉంచారు. ప్రొఫెసర్లు పి.రామకృష్ణారావు, ఒ.ఎస్.ఆర్.యు. భానుకుమార్, జయారాజు, విద్యార్థి నాయకులు సలాంబాబు, సాయి వివేక్, విద్యార్థినులు స్వరూప, యామినిలు ప్రసంగించారు. అనంతరం జగన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మీకందరికి ఉద్యోగాలు కావాలా?వద్దా? అన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నకు.. కావాలంటూ అందరూ రెండు చేతులూ ఎత్తారు.

అందుకు ఏం కావాలి? అన్న ప్రశ్నకు ప్రత్యేక హోదా అంటూ విద్యార్థులు సమాధానమిచ్చారు. హోదా వస్తే రాష్ట్రానికి కేంద్రం 90 శాతం గ్రాంటు, 10 శాతం లోను ఇస్తుందని, హోదా రాకపోతే 70 శాతం లోను, 30 శాతం గ్రాంటు వస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి విశదీకరించారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఎలా అభివృద్ధి చెందుతున్నాయో గణాంకాలతో సహా వివరించారు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న జమ్మూకాశ్మీర్‌కు రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీ ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలో గమనించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదని ఆక్షేపించారు.

ప్రత్యేక హోదాపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆ సమాచారాన్ని  వైఎస్సార్‌సీపీ వెబ్‌సైట్‌లోనూ ఉంచామని చెప్పారు. జగన్ ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు కరతాళ ధ్వనులు, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రసంగం అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నందుకు వారు జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తూ తాము కూడా మీ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారంటూ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. యువభేరి దిగ్విజయం కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. యువభేరి సదస్సును ముగించుకుని జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ పయనమయ్యారు.

 దారి పొడవునా స్వాగత కటౌట్లు: విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు హైవేపై జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మార్గమధ్యలోనూ ఆయనను చూడడానికి ఆయా గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. శ్రీకాకుళంలోనూ జగన్ వస్తున్న దారుల్లో జనం బారులు తీరారు.

మరిన్ని వార్తలు