భార్యను కడతేర్చిన భర్త

13 Apr, 2017 10:54 IST|Sakshi
కదిరి(అనంతపురం): మద్యానికి బానిసై కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని కదిరిలో బాబావలి కాలనీలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బాలకృష్ణ, లావణ్య(26) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
ఈ క్రమంలో మద్యానికి బానిసైన బాలకృష్ణ తరచు భార్యతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ లావణ్యను దారుణంగా కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు