తిరుమల: ‘ఆర్జిత’ టికెట్ల స్కాం వెనుక భారీ నెట్‌వర్క్‌

18 Aug, 2018 21:02 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమలలో వెలుగుచూసిన అక్రమ ఆర్జిత సేవల టికెట్ల బాగోతం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆర్జిత టికెట్లను లక్కీ డిప్‌ ద్వారా టీటీడీ కేటాయిస్తుండటాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి వాటి ద్వారా టికెట్లు పొంది వాటిని వేల రూపాయలకు అమ్ముతున్నట్టు వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని షోలాపూర్‌ కేంద్రంగా ఈ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇంటి దొంగల హస్తం కూడా దీని వెనుక ఉందని అనుమానాలు కలుగుతున్నాయి. షోలాపూర్‌కు చెందిన ప్రభాకర్‌ అనే వ్యక్తి ఒకే మొబైల్‌ నంబర్‌తో 700లకు పైగా యూజర్‌ ఐడీలు క్రియేట్‌ చేసినట్టు తెలుస్తోంది.  అంతేకాదు అతని దగ్గర 1000కి పైగా నకిలీ ఆధార్‌ కార్డులు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. దీనికి గుంటూరు, చెన్నైకి చెందిన ఇద్దరు సహకరించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు