లేనట్లే..!

2 Oct, 2014 02:27 IST|Sakshi
లేనట్లే..!

కడప అర్బన్ :
 నేడు గాంధీ జయంతి.. అలాగే ఖైదీల సంక్షేమ దినోత్సవం కూడా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలను విడుదల చేసి సత్ప్రర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. 1969 నుంచి వేర్వేరు సందర్భాలను పురస్కరించుకుని 2013 వరకు 15 సార్లు జీవోలు విడుదలయ్యాయి. ఆయా జీవోల నిబంధనల మేరకు సత్ప్రవర్తన ఖైదీలను విడుదల చేశారు. ఈ ఏడాది ఆగష్టు 15న సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు సంబంధించిన జీవో విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. గాంధీ జయంతి రోజైనా జీవో విడుదల చేస్తారా లేదా అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది. గత ఏడాది పై రెండు సందర్భాలలో జీవో విడుదల చేయకపోవడం గమనార్హం. ఏడాది చివర్లో డిసెంబర్ 21న జీవో నెం.286ను విడుదల చేశారు.220 జీవో కింద మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏడేళ్ల వాస్తవ శిక్ష, మూడేళ్ల  రెమిషన్‌తో 27 మందిని, మహిళ ఒకరు, ఒక వృద్ధుడిని ఐదేళ్ల వాస్తవ శిక్ష, రెండేళ్ల రెమిషన్ శిక్ష నిబంధనలతో విడుదల చేశారు.

 సత్ప్రవర్తన ఖైదీలంటే....
 రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో ఐదేళ్ల నుంచి జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో తమ శిక్షా కాలంలో సత్ప్రవర్తన కలిగివుండాలి. దైనందిన కార్యక్రమాల్లో క్రమశిక్షణ కలిగి ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా తన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. జైలు అధికారుల దృష్టిలో శిక్షా కాలాన్ని తగ్గించే విధంగా వారు వేసే మార్కులకు అర్హులై ఉండాలి. జీఓలు విడుదలైన సమయాల్లో ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవించే వారు ఆయా జీఓల నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కడప కేంద్ర కారాగారంలో  ఐదేళ్లకు  పైబడి ఇంకా ఎక్కువ శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన ఖైదీలుగా గుర్తించిన వారు 75 నుంచి 100 మంది దాకా ఉన్నారు. వీరిలో కొందరు గత ఏడాది జీఓకు అర్హులైనప్పటికీ వారి నేరాల కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈసారైనా సత్ప్రవర్తన జీఓ విడుదల సమయంలో తమకు న్యాయం చేకూరుస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 1969 నుంచి ఇప్పటి వరకు విడుదలైన సత్ప్రవర్తన జీఓలు
 
 జీఓ            తేది                          సందర్భం                                              నిబంధన
 1321        25.09.1969        100వ గాంధీ జయంతి                          ఐదేళ్ల శిక్ష పూర్తి
 1040        04.08.1972        25వ ఇండిపెండెన్స్ డే                           ఐదేళ్ల శిక్ష పూర్తి
 1137        21.08.1972         ప్రకాశం పంతులు జయంతి                   ఐదేళ్ల శిక్షపూర్తి
 413         03.04.1975          తొలితెలుగు ప్రపంచ
                                                మహాసభలు                                        ఐదేళ్ల శిక్షపూర్తి
 357         20.10.1980        రాష్ట్ర అవతరణ దినోత్సవం రెమిషన్‌తో       ఐదేళ్ల శిక్ష పూర్తి
 21            20.10.1983        సీఎంగా ఎన్టీఆర్
                                             ప్రమాణస్వీకారం                                     ఐదేళ్ల శిక్షపూర్తి
 580         20.10.1984        ఏపీ ప్రజాస్వామ్య
                                              హక్కుల పరిరక్షణ                                 ఐదేళ్ల శిక్షపూర్తి
 4            17.01.1995          సంక్రాంతి పండుగ                                  7+3= 10 ఏళ్ల శిక్ష పూర్తి
 196         08.07.1995        హైకోర్టు తీర్పు                                        7+3=10 ఏళ్ల శిక్ష పూర్తి
 193         11.08.1997        50వ స్వాతంత్య్ర
                                             స్వర్ణోత్సవాలు                                        పదేళ్ల శిక్ష పూర్తి
 18            25.01.2000       50వ గణతంత్ర దినోత్సవం                       పదేళ్ల శిక్షపూర్తి
 196         13.08.2004        స్వాతంత్య్ర దినోత్సవం                             పదేళ్ల శిక్షపూర్తి
 415         01.10.2009        గాంధీ జయంతి                                     పదేళ్ల శిక్షపూర్తి
 28            25.01.2011        రిపబ్లిక్ డే                                            పదేళ్ల శిక్ష పూర్తి
 286          21.12.2012       ఆంధ్రరాష్ట్ర అవతరణ
                                               దినోత్సవం                                           పదేళ్ల శిక్షపూర్తి
 
 జీఓ ఇంకా రాలేదు.. :
 కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో సత్ప్రవర్తన  కలిగిన ఖైదీల విడుదలకు సంబంధించి జీఓ ఇంకా విడుదల కాలేదు. గత ఏడాది 29 మందిని విడుదల చేశాం. జీఓ విడుదలైన తర్వాత మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని మరలా ప్రతిపాదనలు పంపిస్తాం.
 - గోవిందరాజులు, కేంద్ర కారాగార సూపరింటెండెంట్, కడప.
 

 

మరిన్ని వార్తలు