బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్

10 Jul, 2014 16:58 IST|Sakshi
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్

 లోక్సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014-2015)లో ఆంధ్రప్రదేశ్కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు.  విభజన జరిగిన నేపధ్యంలో ఏపి ఎంతో నష్టపోయింది. అనేక అంశాలలో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మించుకోవలసి ఉంది. విద్య, వైద్యంతోపాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు తగిన రీతిలో బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవు.

జాతీయ వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించినవి:

* ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
* ఐఐటి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
* వ్యవసాయ విశ్వవిద్యాలయం
* అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్  ఎక్సైజ్ అకాడమీ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
* విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
* హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి

 బడ్జెట్లో ప్రస్తావించని ప్రధాన అంశాలు:

 * ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ప్రధానమైన  కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు.
* రాష్ట్ర  విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం(ఇండియన్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ను ఏపికి ప్రకటించలేదు.
*  సెంట్రల్ యూనివర్సిటీని ప్రకటించలేదు
* గిరిజన విశ్వవిద్యాలయ ప్రస్తావనలేదు
* అందరూ ఊహించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన కూడా  బడ్జెట్లో లేదు.
* పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనలేదు.
* విభజన సమయంలో కేంద్రం చెప్పిన  విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు.
* విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు