దెయ్యం.. ఒట్టి బూటకం 

17 Jul, 2019 07:36 IST|Sakshi
మ్యాజిక్‌తో అవగాహన కల్పిస్తున్న జేవీవీ సభ్యులు

జన విజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌ 

సి.బెళగల్‌ హాస్టల్‌లో రాత్రి బస

సి.బెళగల్‌: హాస్టల్లో దెయ్యం ఉందనేది ఒట్టి బూటకమని జన విజ్ఞానవేదిక (జేవీవీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ కుమార్‌ అన్నారు. సి.బెళగల్‌ మోడల్‌ బాలికల హాస్టల్‌లో కొన్ని రోజులుగా నెలకొన్న దెయ్యం బూచిపై విద్యార్థినులకు జిల్లా జేవీవీ నాయకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  దెయ్యం పట్టుకుందాం...వస్తారా...? పేరుతో రాత్రి బస   నిర్వహించారు.  ఇందులో భాగంగా వారు మంగళవారం రాత్రి హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులు,  సిబ్బందితో మాట్లాడారు. అనంతరం వారు శాస్త్రీయ నిరూపణ కార్యక్రమాలు  చేపట్టారు. సురేష్‌ కుమార్‌  మాట్లాడుతూ  దెయ్యాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమేనని, ఎవరైనా దెయ్యాని పట్టిస్తే వారికి రూ.లక్ష బహుమతిగా అందజేస్తామన్నారు.   
ఐక్య మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో.. 
అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బేతంచెర్ల మండల అధ్యక్షురాలు సరస్వతి, సభ్యులు మంగమ్మ, అలివేలు, లక్ష్మీదేవి తదితరులు హాస్టల్‌ను చేరుకుని హాస్టల్‌ చుట్టూ పరిసరాలను, విద్యార్థినుల గదులను సందర్శించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్‌లోనే నిద్రించారు.    

మరిన్ని వార్తలు