మార్చి 10లోగా నిర్ణయించండి!

25 Feb, 2015 02:49 IST|Sakshi

ముత్తుకూరు(నేలటూరు): నేలటూరు పంచాయతీని ఏ ప్రాంతానికి తరలించాలన్న అంశాన్ని మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకుని చెప్పాలని కలెక్టర్ జానకి కోరారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల మధ్య జీవనం సాగించలేమంటూ కొద్ది మాసాలుగా ఈ పంచాయతీ వాసులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ జానకి, జేపీ ఇంతియాజ్, నెల్లూరు ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డిలు నాలుగు చోట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు.
 
 నేలటూరు పట్టపుపాళెం..
 పట్టపుపాళెంలో 386 కుటుంబాలున్నాయని, కొత్తగా పెళ్లైనవారితో కలిపి 460 కుటుంబాలున్నాయని జిల్లా కలెక్టర్ ఇక్కడ జరిగిన సభలో చెప్పారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు గోవిందుపట్టపుపాళెంకు ఎంతమంది తరలివె ళతారు, నెల్లూరు సమీపంలోని ధనలక్ష్మీపురానికి ఎందరు వెళతారనేది మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకొని చెప్పాలన్నారు. దీనిని బట్టి భూములు సేకరించాల్సి ఉంటుందన్నారు.
 
 నేలటూరు దళితవాడ..
 నేలటూరు దళితవాడ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ 199 కుటుంబాలున్నాయన్నారు. పునరావాసానికి 17 ఎకరాలు అవసరమన్నారు. ధనలక్ష్మీపురం, వావిలేటిపాడు, మాదరాజుగూడూరు ప్రాంతాల్లో ఎక్కడకు తరలివెళతారో నిర్ణయించాలని కోరారు.
 
 నేలటూరు గ్రామం..
 నేలటూరు గ్రామంలో 263 కుటుంబాలున్నాయని ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి చె ప్పారు. పునరావాసానికి 29.63 ఎకరాలు అవసరమన్నారు. మాదరాజుగూడూరుకు వెళతారా.., మరేదైనా ప్రాంతానికి వెళతారా నిర్ణయించి చెబితే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
 
 650 ఎకరాలకు పరిహారం..
 నేలటూరు గ్రామాన్ని తరలించడంతో పాటు పంచాయతీలోని రైతులకు సంబంధించి 650 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సివుందని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్ ఈపూరు శేషారెడ్డి, స్థానికులు యానాటి శ్రీనివాసులురెడ్డి, ఈపూరు గిరిధర్‌రెడ్డి, పెడకాల శీనయ్య ఈ సమావేశాల్లో మాట్లాడుతూ మూడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. భూములకు పరిహా రం పంపిణీ జరగాలన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై విచారణ జరిపిస్తామన్నారు. జెన్‌కోలో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని, స్థానికులకు 50 శాతం ప్రాధాన్యమిస్తారని హామీ ఇచ్చా రు. పట్టపుపాళెంలో తాగునీరు, మరుగుదొడ్లు, ప్యాకేజీ సమస్యల పరిష్కరించేందకు కృషి చేస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు