మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ ప్లాంటు!

8 Jan, 2014 00:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్, గట్టు మండలాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు మంత్రి డీకే అరుణ మంగళవారం తెలిపారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలను సీఎంకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ప్లాంటుకు అవసరమైన నీటికోసం జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలతోపాటు, విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు.
 

మరిన్ని వార్తలు