దొంగ నోట్ల ముఠా అరెస్ట్

6 Sep, 2014 03:16 IST|Sakshi

ఉరవకొండ :  అంతర్రాష్ర్ట దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో దొంగ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే సామగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఓ మాజీ కానిస్టేబుల్, బీటెక్ విద్యార్థి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ శుక్రవారం ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.
 
  ముఠాలో రాజ్‌కుమార్, వన్నారెడ్డి (కణేకల్లు), నరేంద్ర (తాడిపత్రి), కృష్ణయ్య (కర్నూలు జిల్లా మద్దికెర), అల్లాబకాష్ (గుత్తి), మాజీ కానిస్టేబుల్ తిరుపతయ్య, బీటెక్ విద్యార్థి ఖాసీం, శ్రీనివాసులు, చంద్రశేఖర్ (కర్నూలు) ఉన్నారు. ముఠాలో కీలకనేతలైన రాజ్‌కుమార్, వన్నారెడ్డి అనంతపురంలోని కోవూరునగర్‌లో ఓ అద్దె ఇల్లు తీసుకుని బీటెక్ విద్యార్థి సహకారంతో నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఈ నోట్లను మాజీ కానిస్టేబుల్ తిరుపతయ్య ద్వారా వివిధ ప్రాంతాలకు చేరవేస్తారు.
 
  రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.4 లక్షలు విలువ చేసే నకిలీ నోట్లు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ప్రతినిధులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా చలామణి చేయిస్తారు. ఈ క్రమంలో ఉరవకొండ వుండలం బూదగెవి సమీపంలోని వూరెవ్ము ఆలయుం వద్ద దొంగనోట్ల వూర్పిడి జరుగుతోందన్న సవూచారం అందుకున్న స్పెషల్ పార్టీ ఎస్‌ఐ రాగిరి రావుయ్యు, మరో ఎస్‌ఐ వునోహర్ తమ సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం దాడులు నిర్వహించి, తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఒక టాటా సుమోతోపాటు నకలీ నోట్ల తయారీ పరికరాలు, ప్రింటర్, 21 నల్లని పేపర్ల కట్టలు, 11 సెల్ ఫోన్లు, అసలు నోట్లు రూ.5.49 లక్షలు, నకలీ కరెన్సీ రూ.1.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఎస్‌ఐలు రామయ్య, మనోహర్‌లను ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఎస్పీ రవికుమార్ అభినందించారు.
 

మరిన్ని వార్తలు