అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!

6 Aug, 2019 09:26 IST|Sakshi
బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

సాక్షి, తూర్పుగోదావరి(గొల్లప్రోలు) : పట్టణంలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. స్థానిక మార్కండేయపురంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు మాండపాక ప్రభాకరరావు ఇంట్లో సుమారు రూ.13లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు, విలువైన బాండ్లు, డాక్యుమెంట్లు అపహరణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండపాక ప్రభాకరరావు, అతడి భార్య వరలక్ష్మి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ప్రభాకరరావు ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్‌ పాఠశాలలో, వరలక్ష్మి గొల్లప్రోలులోని మలిరెడ్డి వెంకట్రాజు మండల పరిషత్‌ పాఠశాలలో పని చేస్తున్నారు. ఉదయం యథావిధిగా ఇద్దరూ విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి , బీరువాలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న భర్త ప్రభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు.

ఇంటి వెనుక గోడ దూకి వచ్చి
చోరీకీ పాల్పడిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు బురద కాలితో ఉన్న ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఇంటి తాళం బద్దలు కొట్టి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి బీరువా తాళం తెరిచి అందులో ఉన్న వస్తువులను సోఫా, మంచంపై పేర్చి బాక్సుల్లో ఉన్న వస్తువులను చాకచక్యంగా అపహరించాడు. 

రూ.13లక్షల విలువైన సొత్తు అపహరణ
43కాసుల బంగారు ఆభరణాలు, 57 తులాల వెండి వస్తువులతో పాటు రూ.20వేల నగదు చోరీకు గురైంది. వీటి విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. వీటితో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో డిపాజిట్‌ చేసిన రూ.9.85 లక్షల విలువైన డిపాజిట్‌ బాండ్లు, రెండు స్థలాల డాక్యుమెంట్లు, భూమి డాక్యుమెంట్లు కూడా అపహరణకు గురయ్యాయి. క్రైమ్‌ పార్టీ, స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి, సమీప నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కౌలు కష్టం దక్కనుంది

దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తల మృతి

ఇంటికెళ్లి తాగాల్సిందే..!

అనూహ్య‘స్పందన’

బతుకు లేక.. బతకలేక..!

ఉద్యోగాల విప్లవం

హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం

ఆరో రోజూ...అదే ఆగ్రహం 

కేశవదాసుపురంలో రెండో రోజూ ఉద్రిక్తత

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం..

8న సీఎం పులివెందుల పర్యటన

సేవకు సంసిద్ధం 

ఇంటి నుంచే స్పందన

సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి

తప్పులు చేసి నీతులు చెబుతారా?

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

ఆర్టికల్‌ 370 రద్దు భారతావనికి వరం

తగ్గని గోదా'వడి'

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

‘స్పందన’.. ప్రజాసంద్రం

ఉదారంగా నిధులివ్వండి

వరద బాధితులకు తక్షణ సహాయం

ఈనాటి ముఖ్యాంశాలు

‘కరువు రైతులను ఆదుకునేందుకు రూ. 2వేల కోట్లు’

గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్‌ ఆయనే’

‘నువ్వు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?