మూతపడనున్న తిరుమల, శ్రీశైలం ఆలయాలు

17 Dec, 2019 02:26 IST|Sakshi

26న కొన్ని గంటల పాటు మూతపడనున్న తిరుమల, శ్రీశైలం ఆలయాలు

‍సాక్షి, తిరుమల/శ్రీశైలం: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహాద్వారాలను మూసివే యనున్నారు. 26న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు. ఈ లెక్కన 25న రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆల య తలుపులను మూసివేయనున్నారు. 26న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యా హ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, శ్రీశైలం ఆలయ మహాద్వారాలను ఈ నెల 26న కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన తరువాత అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరవను న్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. 

నేడు శ్రీవారి ‘ప్రత్యేక’ ప్రవేశ దర్శనం
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఈనెల 17న వయోవృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను అధికారులు జారీ చేస్తారు. అలాగే, ఈనెల 18న 5 ఏళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.  

మరిన్ని వార్తలు