19, 20 తేదీల్లో కేంద్ర బృందం పర్యటన

16 Nov, 2013 02:17 IST|Sakshi

శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్:  పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించేందుకు.. నష్టాలను అంచనా వేసేందు కు ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శంభుసింగ్ నేతృత్వంలో హోం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్, ప్లానింగ్ కమిషన్, రోడ్స్ అండ్ హైవేస్, వాట ర్‌సప్లై, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఆర్.పి.సింగ్, వి.కె.భట్ల, కె.రాంవర్మ, ఎ.చంద్రశేఖర్, ఎ.కృష్ణప్రసాద్, పి.జి.ఎస్.రావులతో కూడిన ఈ బృం దం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.
 ఇదీ షెడ్యూల్
 19వ తేదీ:
  మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం బంటుపల్లిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, రోడ్లను పరిశీలిస్తుంది.
   3.30 గంటలకు లావేరు మండలం ఆదపాక, బుడుమూరుల్లో జరిగిన పంట నష్టం, చెరువులకు పడిన గండ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తుంది. అనంతరం బుడుమూరు ఎస్‌సీ కాలనీని సందర్శిస్తుంది.
   4.10 గంటలకు పొందూరు మండలం లోలుగులోని కుమ్మరి గుంట చెరువు, ఇరిగేషన్ కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం ఎచ్చెర్ల టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. అనంతరం ఫరీద్‌పేట వద్ద నాగావళి కుడి కాలువ గట్టుకు పడిన గండిని పరిశీలించి ఆక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. రాత్రికి శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తుంది.
 20వ తేదీ:
   ఉదయం 10.30 గంటలకు సోంపేట మండలం ఇస్కలపాలెంలో పర్యటిస్తుంది. అనంతరం కవిటి మండలం రాజపురం ప్రాంతంలో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. తర్వాత పలాస మండలం సున్నాదేవి గ్రామంలో పర్యటిస్తుంది.
   మధ్యాహ్నం 2 గంటలకు పలాస నుంచి బయలుదేరి కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, బోరుభద్ర మీదుగా పోలాకి మండలం డీఎల్ పురం, సుసరాం వరకు వరి పంటకు జరిగిన నష్టాన్ని, వంశధార కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం నరసన్నపేట మండలం కోమర్తిలో అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది.
   మధ్యాహ్నం 3.30 గంటలకు ఎచ్చెర్ల మండలం ముద్దాడకు వెళ్లి అక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. అనంతరం కేంద్ర బృందం విశాఖపట్నం వెళుతుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా