కెమెరాల్లో పట్టేస్తాం.. ఈ చలాన్ పంపిస్తాం

21 Nov, 2015 01:31 IST|Sakshi

ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహన చోదకులపై ప్రత్యేక దృష్టి
డీజీపీ జే వీ రాముడు వెల్లడి
ఈ-ఆఫీస్ అప్లికేషన్, ఈ-చలానా, ఎఫ్‌ఎం రేడియో సేవలు ప్రారంభం


 ఏలూరు అర్బన్ : జిల్లాలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు చేపడతామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు చెప్పారు. శుక్రవారం ఏలూరు వచ్చిన ఆయన ఈ-ఆఫీస్ అప్లికేషన్, ఈ-చలానా, ఎఫ్‌ఎం రేడియో సేవలను ఆరోగ్య భద్రత పథకంలో తల్లిదండ్రులనూ చేర్చండి
 
 డీజీపీకి పోలీసు అధికారుల సంఘం వినతి
 ఏలూరు అర్బన్ : పోలీసు ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య భద్రత పథకంలో వారి తల్లిదండ్రులనూ చేర్చాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం డీజీపీ జేవీ రాముడుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నగరానికి విచ్చేసిన డీజీపీని సంఘ అధ్యక్షుడు కె.నాగరాజు, కార్యదర్శి కె.రజనీకుమార్, నాయకులు కె.వెంకటరావు, జి.దివాకర్, ఏకే సత్యనారాయణ తదితరులు కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆర్థో, డెంటల్, జనరల్ వైద్య సేవలకు గాను జిల్లాలో మరో మూడు ఆసుపత్రులను నెట్‌వర్క్ జాబితాలో చేర్చాలని వినతి పత్రంలో కోరారు.
 
  చనిపోయిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష సాయం అందించేందుకు ప్రతినెలా పోలీసు ఉద్యోగుల జీతాల నుంచి రూ.50 మినహాయించి డిసీజ్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్‌కు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జమ చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. సంఘ కార్యాలయానికి సొంత భవనం నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
 
 ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు  కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని సీసీ కె మెరాల ద్వారా గుర్తించి, మల్టీపర్పస్ పోలీస్ డివైస్ (ఎంపీడీ) సాయంతో జరిమానాలకు సంబంధించి ఈ చలానాలు  జారీ చేస్తామని చెప్పారు. జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించే క్రమంలో ఈ చలానా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కోసం తొలిసారిగా ఎఫ్‌ఎం రేడియో 88.7 ప్రారంభి స్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌ఎం రేడియో సేవలు ఏలూరు నగర వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, త్వరలో జిల్లా అంతటా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందించే లక్ష్యంతో ఈ-ఆఫీస్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలోని తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లాలో దీనిని అమల్లోకి తెచ్చామన్నారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లలో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్‌మేటిక్ సెంటర్ అందించిందని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
 
 ‘కృపామణి’ నిందితుల్ని వదలం
 వ్యభిచార ఊబిలోకి దించే ప్రయత్నాలను భరించలేక తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య, చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలపై డీజీపీ స్పందించారు. ఈ కేసులను అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పా రు. అంతకుముందు ఏలూరులో నిర్మించిన పోలీసు జిమ్, సురేష్ బహుగుణ స్కూల్‌లో నూతనంగా నిర్మించిన భవనాలను డీజీపీ ప్రారంభించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ సమీపంలో నిర్మించిన అమర పోలీసు వీరుల స్థూపాన్ని సందర్శించారు. ఆయన వెంట కోస్తా జిల్లాల ఐజీ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజి డీఐజీ పి.హరికుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఉన్నారు.
 
 పోలీస్ అధికారులతో సమీక్ష
 డీజీపీ రాముడు ఏలూరు రేంజి పోలీసు ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కృపామణి ఆత్మహత్య, దేవరపల్లిలో కన్న కుమారుణ్ణి తండ్రి హత్య చేసిన ఘటన తదితర కేసులకు సంబంధించిన వివరాలు, ఆ కేసుల్లో పురోగతిపై ఆరా తీశారు. జిల్లా సరిహద్దులో మావోయిస్టుల సంచారం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారని సమాచారం.
 

మరిన్ని వార్తలు