రాష్ట్ర సమైక్యత కోసం వెయ్యి గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

22 Sep, 2013 09:19 IST|Sakshi
రాష్ట్ర సమైక్యత కోసం వెయ్యి గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

అనంతపురం: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని జిల్లాలోని ఒక వెయ్యి మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సర్పంచ్లు ఆ తీర్మానం కాపీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్లకు పంపారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యఉద్యమాలు 54వ రోజుకు చేరాయి. రాష్ట్ర విభజన ప్రకటించిన రోజు నుంచి ఈ జిల్లాలో సమైక్యవాదులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఆ రోజు నుంచి ఉద్యమాన్ని రోజురోజుకు ఉధృతం చేస్తూ కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు.

 ఏపీఎన్జీవో, రెవిన్యూ, ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. 1000 ఆర్టీసీ బస్సులు గత 54 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా ఆర్టీసీకీ 40 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ(జెఎన్టియు) విద్యార్ధులు, ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు