ఉత్తరాంధ్రకు పెనుముప్పు!

11 Oct, 2014 16:33 IST|Sakshi
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు!

విశాఖపట్నం:  హుదూద్ పెను తుపాను మరింత తీవ్రమైంది. ఈ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు పెనుముప్పు పొంచి ఉంది. విశాఖకు 260 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

తుపాను తీరందాటే సమయంలో ఉప్పెన మాదిరిగా అలలు వస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది.  195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను రేపు ఉదయం విశాఖ పరిసరాలలో తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో తుపాను విధ్వంసం బాగా ఉండే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.

ఇదిలా ఉండగా,  ఇచ్ఛాపురం-కాకినాడ మధ్య జాతీయ రహదారిని మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఐఎన్ఎస్ డేగాలో ఆరు హెలీకాప్ట్ర్లను సిద్ధంగా ఉంచారు.
**

మరిన్ని వార్తలు