లైంగిక దాడికి యత్నించిన జవాన్లకు రిమాండ్

6 Nov, 2013 08:43 IST|Sakshi

సికింద్రాబాద్ : ఈస్ట్ మారేడ్పల్లికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి యత్నించిన ముగ్గురు జవాన్లను రిమాండ్కు తరలించినట్లు నార్త్జోన్ డీసీపీ జయలక్ష్మి తెలిపారు. స్నేహితుడితో దైవ దర్శనానికి వెళ్లివస్తున్న ఓ బాలికపై ఆదివారం రాత్రి ముగ్గురు జవాన్లు లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు లాక్ బహదూర్ శెట్టి (28), తపస్ మెహతి (29), సులాన్ నర్జర్నారి (29) ముగు్గరు జవాన్లను తుకారంగేట్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి ఆదేశం మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు.

వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ లోని  మహేంద్ర హిల్స్ లోని సాయిబాబా గుడి నుంచి వస్తున్న ఇద్దర్ని రాత్రి పది గంటల సమయంలో ఆర్మీ జవాన్లు అడ్డుకున్నారు. ఆతర్వాత  స్నేహితుడిని కొట్టి బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్లడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని.. బాలికను రక్షించారు. ఈ కిరాతకానికి పాల్పడిన ఆర్మీ జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాధితురాలిని ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉంది.

మరిన్ని వార్తలు