నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన

22 Jun, 2020 04:31 IST|Sakshi

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

సాధారణంగానే నైరుతి ప్రభావం.. 

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.  

తడిసి ముద్దయిన బెజవాడ: ఆదివారం కురిసిన వర్షాలకు విజయవాడ తడిసి ముద్దయింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా అంతటా సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడగా.. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. పల్నాడులో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి.   

>
మరిన్ని వార్తలు