పగబట్టిన మృత్యువు     

13 Apr, 2018 10:43 IST|Sakshi
మృతుడు పాటోజు రామకృష్ట(ఫైల్‌)

ఒక రోజు వ్యవధిలో తల్లీకుమారుల మృతి

నెల రోజుల క్రితం కుటుంబ పెద్ద ...

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

ఆ కుటుంబంపై విధి పగబట్టినట్టుంది. నెలరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త, కుమారుడిని మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయింది.

మాడుగుల రూరల్‌: ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు ఒక రోజు వ్యవధిలో మృతి చెం దగా, కుటుంబం యజమాని నెల రోజుల క్రితం మరణించాడు.  వివరాలు ఇలా లున్నాయి. కె.జె.పురం గ్రామానికి చెందిన పాటోజు నాగభూషణం బంగారం పనిచేసేవాడు.

ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు, చిన్న కుమారుడికి వివాహం జరిగింది.  నెల రోజుల క్రితం నాగభూషణం అకస్మాత్తుగా మృతి చెందాడు.  ఆయన భార్య ఈశ్వరమ్మ  ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మంచం పట్టింది.

 ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేసేవారు.  నాగభూషణం మృతి చెందిన విషాదం నుంచి ఆ కుటుంబ కోలుకోకముందే  ఈశ్వరమ్మ ఈ నెల 11వ తేదీ  సాయంత్రం కె.జె.పురంలో మృతి చెందింది. ఆమెకు గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ విషాదం నుంచి తేరుకోక  ముందే నాగభూషణం పెద్ద కుమారుడు పాటోజు రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆయన గతంలో హైదరాబాద్‌లో సినీ రంగంలో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో క్యాన్సర్‌ సోకింది.  

మిత్రులు సాయం చేసి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో తన సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు. దీంతో ఆ విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ మృతదేహాన్ని అక్కడ నుంచి కె.జె.పురం తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా