విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

9 Dec, 2019 16:13 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: పొలానికి వెళ్లిన ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఎల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరు రైతు కూలీలు కృష్ణయ్య, చెంచమ్మ పొలం పనులు చేయడానికి సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అయితే ఆ పొలానికి ఉన్న విద్యుత్‌ కంచె తగలడంతో విద్యుదాఘాతానికి గురైన కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో బాలుడు గౌతమ్‌ కూడా అక్కడే ఉండటంతో అతను కూడా మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా