శేషాచలంలో భీకరపోరు

30 May, 2014 03:26 IST|Sakshi
శేషాచలంలో భీకరపోరు

ముగ్గురు ఎర్రచందనం దొంగల మృతి
 సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో బుధవారం అర్ధరాత్రి ఎర్రచందనం దొంగలు, ఎస్‌టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. మృతులు తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన కూలీలు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుమల ఆలయానికి పడమర దిశలో పది కిలోమీటర్ల దూరంలో తలకోన ఛామలారేంజ్‌లో బుధవారం ఉదయం నుంచి ఎస్‌టీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
 
 రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు వంద మంది కూలీలు ఒక్కసారిగా వారిపై రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు. అప్రమత్తమైన పోలీసులు రెండు గంటలపాటు సుమారు నలభై రౌండ్ల దాకా ఎదురుకాల్పులు జరిపారు. అయితే, గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా మూడు ఎర్రచందనం దొంగల మృతదేహాలు కనిపించాయి. అలాగే, స్మగ్లర్లు వాడిన  గొడ్డళ్లు, కత్తులు, దాడి చేసేందుకు సిద్ధం చేసిన విల్లబులు, రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పీ రాజశేఖరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్మగ్లర్లను ఏరిపారేస్తామని ఎస్‌పీ ఈ సందర్భంగా చెప్పారు.

మరిన్ని వార్తలు